ఏపీ వైపు.. ముంచుకొస్తున్న మరో తుపాను | Cyclone Threat To AP Coast Low Pressure Has Strengthened | Sakshi
Sakshi News home page

ఏపీ వైపు.. ముంచుకొస్తున్న మరో తుపాను

Nov 14 2026 9:28 AM | Updated on Nov 14 2026 9:30 AM

Cyclone Threat To AP Coast Low Pressure Has Strengthened

సాక్షి, విశాఖపట్నం: ఏపీ కోస్తా తీరానికి తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. 16వ తేదీ నాటికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య దిశగా వ్యవస్థ కదులుతోంది.. 19వ తేదీ నాటికి మరింత బలపడి తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని ఆ తరువాత ఇది తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్ర, లేదా ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత వాతావరణం చల్లగా ఉండడంతో ఇది భూమి మీదకు రాకుండా సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. దీని ప్రభావం కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్య ఉండవచ్చు. ఆదివారం నుంచి ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం కూడా అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఇదీ చదవండి: రబీలో భీకర కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement