హైదరాబాద్ : దేశ విదేశాల ప్రతినిధులు..స్వదేశీ కళాకారులు కలిసి సందడి చేశారు. సంప్రదాయ నృత్యాలు, పాటలు, సంగీత పరికరాలు, సెల్ఫీలు, ఫొటో సెషన్లతో ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణం సృష్టించారు.
హైటెక్‌సిటీలోని హెచ్ఐసీసీ ఇందుకు వేదికైంది. శుక్రవారం ఇక్కడ ‘కొత్త ప్రపంచ నిర్మాణం’ పేరిట ‘భారత్ సమ్మిట్’ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది.
70 దేశాల ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.


