సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. వచ్చే మంగళవారం రూ.1,000 కోట్ల బడ్జెట్ అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా ఈ అప్పును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది.