సాక్షి, కర్నూలు: పారిశ్రామిక స్థాపన పేరుతో చంద్రబాబు కామెడీ షోను నిర్వహించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బివై రామయ్య మండిపడ్డారు. విశాఖ వేదికగా చంద్రబాబు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పబ్లిసిటీ చేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ విశాఖపట్నం పరిశ్రమ సదస్సు పేరుతో అన్ని అబద్ధాలు ఆడారు’’ అంటూ రామయ్య దుయ్యబట్టారు.
‘‘సదస్సుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చెప్పడం లేదు. సీని నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన, రాణాతో చిట్ చాట్ తప్ప పరిశ్రమలు తీసుకొని రాలేదు. ప్రజల ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రైతులను పట్టించుకోవడం లేదు. లేజర్ ద్వారా ఇంటి ఇంటికి విద్యుత్ అందిస్తామని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదు.
..పారిశ్రామిక స్థూపం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. పరిశ్రమల ఒప్పందం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కనిపించలేదు. అన్ని శాఖలను నారా లోకేష్ నడిపిస్తున్నారు. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దౌర్జన్యం, దాడులతో కొనసాగాయి. ఇష్టారాజ్యంగా పోలీసులు, ఎలక్షన్ కమిషన్‌ను ఎలా వాడుకున్నారో ప్రజలకు తెలుసు’’ అని బీవై రామయ్య పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పులివెందుల రిజర్వేషన్‌లో ట్విస్ట్.. ఈసీ ఇదేం లెక్క?


