పసికందు అపహరణ.. ట్విస్ట్‌.. తిరిగి తెచ్చిచ్చిన నిందితుడు | Baby kidnapping in Srikalahasti, Thottambedu because of Family Debt | Sakshi
Sakshi News home page

పసికందు అపహరణ.. ట్విస్ట్‌.. తిరిగి తెచ్చిచ్చిన నిందితుడు

Nov 14 2026 2:58 PM | Updated on Nov 14 2026 3:13 PM

Baby kidnapping in Srikalahasti, Thottambedu because of Family Debt

సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో ఓ ఆరు నెలల పసికందును అపహరించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాళహస్తి ప్రాంతంలోని తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ కుటుంబం వారి అవసరాల రీత్యా ఇతరుల వద్ద రూ.1.50 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పు తిరిగి చెల్లించకపోవడంతో పాటు ఐదు రూపాయల వడ్డీ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అప్పు వసూలు చేసుకునేందుకు వచ్చిన వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.

దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోలీసుల జోక్యంతో నిందితులు చిన్నారిని తల్లి ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లినట్లు సమాచారం. దీంతో పసికందు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. అప్పు వసూలు కోసం ఆరు నెలల చిన్నారిని అపహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదీ చదవండి: రసగుల్లా అంటూ బాంబు చేతిలో పెట్టాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement