రసగుల్లా అంటూ బాంబు చేతిలో పెట్టాడు | Man Offered Bomb As Rasgulla, But He Dies After Biting It | Sakshi
Sakshi News home page

రసగుల్లా అంటూ బాంబు చేతిలో పెట్టాడు

Nov 12 2026 7:15 PM | Updated on Nov 12 2026 7:25 PM

Man Offered Bomb As Rasgulla, But He Dies After Biting It

మధ్యప్రదేశ్: రసగుల్లా అని నమ్మించి ఓ వ్యక్తికి బాంబు ఇవ్వడంతో దాన్ని కొరికిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

జిల్లాలోని పదరియా గ్రామానికి చెందిన రాజేంద్ర బరోటియా ఇంట్లో ఉండగా రామ్ భగత్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అయితే వీరి మాటల మధ్యలో రామ్ భగత్ ఓ నాటు బాంబును రసగుల్లా అంటూ రాజేంద్రకు ఇచ్చాడు. దాంతో అది నిజంగానే స్వీటని భావించిన రాజేంద్ర నోట్లో వేసుకుని కొరకడంతో భారీ పేలుడు సంభవించి రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.

దాంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామ్ భగత్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వ్యక్తిగత కక్షల కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: లోకల్ రైలులో మహిళపై దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement