'వైష్ణవి శర్మ' 4 బంతుల్లో 4 వికెట్లు | Vaishnavi Sharma takes 4 wickets in 4 balls in the domestic senior womens T20 tournament | Sakshi
Sakshi News home page

'వైష్ణవి శర్మ' 4 బంతుల్లో 4 వికెట్లు

Nov 7 2026 3:54 AM | Updated on Nov 7 2026 3:54 AM

Vaishnavi Sharma takes 4 wickets in 4 balls in the domestic senior womens T20 tournament

‘హ్యాట్రిక్‌’తో సహా 6 వికెట్లు తీసిన మధ్యప్రదేశ్‌ స్పిన్నర్‌  

న్యూ చండీగఢ్‌: భారత జట్టు సభ్యురాలు... మధ్యప్రదేశ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ దేశవాళీ సీనియర్‌ మహిళల టి20 టోర్నీలో సత్తా చాటింది. శుక్రవారం ఆంధ్ర తో జరిగిన గ్రూప్‌ ‘బి’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో వైష్ణవి ‘హ్యాట్రిక్‌’ సహా వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆంధ్ర ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌ చివరి 4 బంతుల్లో వైష్ణవి వరుసగా హెన్రిటా పెరీరా, అంజలి శర్వాణి, అఖిల పావని, షబ్నమ్‌ షకీల్‌లను అవుట్‌ చేసింది. 

మొత్తంగా వైష్ణవి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. ఆమె పదునైన బౌలింగ్‌కు ఆంధ్ర 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులే చేయగలిగింది. హెన్రిటా పెరీరా (41 బంతుల్లో 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ 15.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 133 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అనుష్క శర్మ (53 బంతుల్లో 81 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుకు తోడు ఆయుషి శుక్లా (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మధ్యప్రదేశ్‌ మరో 28 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

6 మహిళల టి20 క్రికెట్‌లో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా వైష్ణవి శర్మ గుర్తింపు పొందింది. గతంలో అనురాధా దొడ్డబళ్లాపూర్‌ (జర్మనీ; ఆ్రస్టియాపై 2020లో), హుమైరా కాజీ (ముంబై; సౌరాష్ట్రపై 2022లో), హెన్రిటె ఇషిమ్‌వి (రువాండా; జింబాబ్వేపై 2023లో), తిపచ పుతావోంగ్‌ (థాయ్‌లాండ్‌; నెదర్లాండ్స్‌పై 2023లో), అహిల్యా చండేల్‌ (జపాన్‌; చైనాపై 2024లో) ఈ ఘనత సాధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement