breaking news
Vaishnavi Sharma
-
బ్యాటర్ల విధ్వంసం.. భారత్ సంచలన విజయం; సిరీస్ కైవసం
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 363 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా-ఎ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లలో మిన్నూ మాని (56 బంతుల్లో 88 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించగా, నిక్కీ ప్రసాద్ (76), కెప్టెన్ అనుష్క శర్మ (58), తనీషా సింగ్ (60) అర్థశతకాలతో రెచ్చిపోయారు. జట్టులో నలుగురు బ్యాటర్లు అర్థశతకాలు చేసి తమ విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆసీస్ బౌలర్లలో చార్లీ నాట్, లిల్లీ మిల్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్ చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: రెండుగా చీలిన భారత్; దంచేసిన కోహ్లి, రోహిత్.. గిల్ ప్లాఫ్ షో! -
సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం
మొహలీ వేదికగా ఇండియా-ఎ వుమెన్‌తో జరుగుతున్న అనధికారిక మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్ భారీ స్కోరు సాధించింది. చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ తాహిలా విల్సన్ (38), రాచెల్ త్రినెమన్ (29) పర్వాలేదనిపించారు. చివర్లో హేలీ సిల్వర్ హోమ్స్ (8 బంతుల్లో 19 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా 360 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.కాగా మూడో వికెట్‌కు చార్లీ నాట్, కౌర్ట్నీ వెబ్ 116 బంతుల్లో 166 పరుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డారు. కాగా ఇరుజట్లు చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. -
సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. అయితే డబ్ల్యూపీఎల్- 2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ ఆల్‌రౌండర్ అనుష్క శర్మకు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది.అదేవిధంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారతీ ఫుల్మాలిని ప్రోటీస్‌తో సిరీస్‌కూ కొనసాగించారు. అద్భుతమైన హిట్టింగ్ స్కిల్స్ ఉన్న భారతీకి ఆసీస్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. మరోవైపు 22 ఏళ్ల పేసర్ కాశ్వి గౌతమ్‌కు తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది.అయితే యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ, స్నేహ రాణాలను ఈ సిరీస్‌కు సెలెక్టర్లు పక్కన పెట్టారు. కాగా ఈ సిరీస్ మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా జరగనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఏప్రిల్ 17 నుంచి ప్రోటీస్ గడ్డపై ప్రారంభం కానుంది.దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు:హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాశ్వి గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), అనుష్క శర్మ.సిరీస్ షెడ్యూల్:1.ఏప్రిల్ 17: మొదటి టీ20 (డర్బన్)2.ఏప్రిల్ 19: రెండో టీ20 (డర్బన్)3.ఏప్రిల్ 22: మూడో టీ20 (జోహన్నెస్‌బర్గ్)4.ఏప్రిల్ 25: నాలుగో టీ20 (జోహన్నెస్‌బర్గ్)5.ఏప్రిల్ 27: ఐదో టీ20 (బెనోని)చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే! -
ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ
డబ్ల్యూపీఎల్ 2026 ఎడిషన్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు పెద్దగా కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నా, మరో రెండు జట్లు కూడా సమాంతర పాయింట్లు కలిగి ఉండటంతో ఈ స్థానానికి గ్యారెంటీ లేదు. యూపీ వారియర్జ్, గుజరాత్ జెయింట్స్ కూడా ఐదు మ్యాచ్‌ల్లో చెరో రెండు విజయాలు సాధించి, ముంబై ఇండియన్స్‌తో పాటు 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంతో పాటు, మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో చివరి స్థానంలో ఉంది.ఈ ఎడిషన్‌లో ఆశించిన విజయాలు సాధించలేకపోతున్న ముంబై ఇండియన్స్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్‌కీపింగ్ బ్యాటర్ జి కమిలిని గాయం బారిన పడి ఎడిషన్ మొత్తానికి దూరమైంది. ఆమె స్థానాన్ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎడమచేతి వాటం స్పిన్నర్ వైష్ణవి శర్మతో భర్తీ చేసింది.17 ఏళ్ల కమిలిని ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ముంబై ఇండియన్స్‌కు నమ్మదగిన బ్యాటర్‌గా ఉండింది. ఆమె లేని లోటు ఎంఐ బ్యాటింగ్ ఆర్డర్‌ను ప్రభావితం చేయవచ్చు.వైష్ణవి శర్మతో భర్తీ 20 ఏళ్ల వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలతో జట్టులోకి తీసుకుంది. వైష్ణవి 2025 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో కీలక సభ్యురాలు. ఇటీవలే ఆమె టీమిండియా తరఫున కూడా అరంగేట్రం చేసింది. డబ్ల్యూపీఎల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైష్ణవి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. డబ్ల్యూపీఎల్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు సైతం వైష్ణవి ఎంపికైంది. వైష్ణవి చేరికతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలపడనుంది. ముంబై ఇండియన్స్ ఇవాళ (జనవరి 20) ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం. -
అప్పటివరకు భయపడ్డా.. హర్మన్ చాలా సపోర్ట్ చేసింది: వైష్ణవి
అరంగేట్రంలోనే ఆకట్టుకున్న భారత మహిళా జట్టు స్పిన్నర్ వైష్ణవి శర్మ తన ఆటతీరు పట్ల సంతృప్తిని వెలిబుచ్చింది. విశాఖ వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిని తొలి టీ20 మ్యాచ్‌లో 20 ఏళ్ల పంజాబీ స్పిన్నర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొట్టింది. పూర్తి కోటా (4 ఓవర్లు) బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 16 పరుగులే ఇచి్చంది. వికెట్ తీయలేకపోయినప్పటికీ టి20లో ఇంత పొదుపుగా బౌలింగ్ చేయడం కూడా గొప్ప విషయం.పైగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఆమె స్పెల్ (4–0–16–0) దోహదపడింది. మెయిడిన్ ఓవర్ లేకపోయినా... ఓవర్‌కు 4 పరుగుల ఎకానమీ రేట్ టి20ల్లో కచ్చితంగా ఉత్తమ ప్రదర్శనే అవుతుంది. ఇంత బాగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ దక్కకపోవడం ఏమాత్రం నిరాశ కలిగించలేదని వైష్ణవి పేర్కొంది.జట్టు సహచరులు, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అంతా సానుకూల దృక్పథాన్ని అలవర్చిందని చెప్పుకొచ్చింది. మంగళవారం ఇదే వేదికపై భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య రెండో టి20 జరుగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 1–0తో ఆధిక్యంలో ఉంది. హర్మన్ ప్రోత్సహించింది!"నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. వికెట్ తీయలేదన్న నిరాశ ఏ మూలన కూడా లేదు. నిజం చెబుతున్నా నేననుకున్న విధంగా నా ప్రణాళికల్ని అమలు చేయగలిగాను. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించాను. ఒక్క మ్యాచ్‌తోనే అయిపోలేదుగా... ఇంకా నాలుగు మ్యాచ్‌లున్నాయి. మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు కాస్త భయపడిన మాట వాస్తవమే! కానీ జాతీయ గీతం ఆలాపించాకా ఆ బెరుకు, భయం తొలగింది. మనసు నిర్మలమైంది. అందువల్లేనేమో నా పని నేను సానుకూల దృక్పథంతో చేసుకోగలిగాను. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జట్టు మేనేజ్మెంట్ నన్నెంతగానో ప్రోత్సహించారు" అని వైష్ణవి శర్మ వివరించింది.చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?


