గుంటూరు కుర్రాడు భారీ సెంచరీ.. పంజాబ్‌తో మ్యాచ్ డ్రా | Punjab vs Andhra, Elite Group Match draw | Sakshi
Sakshi News home page

గుంటూరు కుర్రాడు భారీ సెంచరీ.. పంజాబ్‌తో మ్యాచ్ డ్రా

Nov 5 2026 6:43 PM | Updated on Nov 5 2026 7:05 PM

Punjab vs Andhra, Elite Group Match draw

రంజీ ట్రోఫీ-2027 సీజన్‌లో తొలి విజయం కోసం ఆంధ్ర జట్టు నిరీక్షణ కొనసాగుతోంది. ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా ఛండీగఢ్‌ వేదికగా పంజాబ్‌-ఆంధ్ర మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 592 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

పంజాబ్‌ బ్యాటర్లలో సాన్వీర్ సింగ్(375 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 205) భారీ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు వికెట్‌కీపర్ సైల్‌ ఆరోరా(144), ఎమన్జోత్ సింగ్ చాహల్(122) సెంచరీలతో కదం తొక్కారు. ఆంధ్ర బౌలర్లలో సాయితేజ మూడు, కె ఎస్ నరసింహ రాజు, త్రిపురాన విజయ్‌, సౌరభ్‌ కుమార్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.

పంజాబ్ జట్టు తొలి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. అనంతరం ఆంధ్ర జట్టు కూడా ధీటుగా బదులిచ్చింది. చివరి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది.

ఆంధ్ర బ్యాటర్లలో గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (223 బంతుల్లో 176, 19 ఫోర్లు) తన ఆరో ఫస్ట్‌ క్లాస్‌ సెంచరీతో చెలరేగగా... కరణ్‌ షిండే (198 బంతుల్లో 73 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.

 వీరిద్దరు మూడో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (49) రాణించగా, రేవంత్‌ రెడ్డి (3) విఫలమయ్యాడు. కాగా ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. రెండింట ఓటమి, మరో రెండింటిని డ్రాగా ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement