40 ఏళ్ల వయసులో రికార్డు శతకం | ZIM VS AFG 1st Test: Brendan Taylor becomes the second oldest player to score a Test century since 2000 | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల వయసులో రికార్డు శతకం

Nov 5 2026 5:05 PM | Updated on Nov 5 2026 5:14 PM

ZIM VS AFG 1st Test: Brendan Taylor becomes the second oldest player to score a Test century since 2000

source: X

జింబాబ్వే వెటరన్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌ 40 ఏళ్ల 272 రోజుల వయసులో టెస్ట్‌ శతకం బాది రికార్డుల్లోకెక్కాడు. 2000 సంవత్సరం తర్వాత టెస్టు సెంచరీ సాధించిన రెండో అతి పెద్ద వయస్కుడిగా (2016లో పాక్‌ ఆటగాడు మిస్బా ఉల్‌ హక్‌ 42 ఏళ్ల 47 రోజుల వయసులో టెస్ట్‌ సెంచరీ సాధించాడు) నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ మొదలైన తొలి టెస్ట్‌లో టేలర్‌ ఈ ఘనత సాధించాడు.

ఓవరాల్‌గా లేటు వయసులో టెస్ట్‌ సెంచరీ చేసిన ఘనత ఇంగ్లండ్‌ ఆటగాడు జాక్‌ హాబ్స్‌ పేరిట ఉంది. హాబ్స్‌ 46 ఏళ్ల 82 రోజుల వయసులో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సెంచరీ సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న జింబాబ్వే తొలి రోజు మూడో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఇన్నోసెంట్‌ కైయా (34), బెన్‌ కర్రన్‌ (42) ఔట్‌ కాగా.. బ్రెండన్‌ టేలర్‌ (117), కెప్టెన్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ (43) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ సలీం సఫీ, కైస్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి: Asia Cup: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన శ్రీలంక


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement