Asia Cup: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన శ్రీలంక | ACC Men's U19 Asia Cup 2026: Sri Lanka Beat Malaysia By 9 Wickets | Sakshi
Sakshi News home page

Asia Cup: పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన శ్రీలంక

Nov 5 2026 4:08 PM | Updated on Nov 5 2026 4:26 PM

ACC Men's U19 Asia Cup 2026: Sri Lanka Beat Malaysia By 9 Wickets

బోణీ కొట్టిన శ్రీలంక (PC: ACC Media X)

ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌-2026 టోర్నమెంట్లో శ్రీలంక బోణీ కొట్టింది. పసికూన మలేషియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అల్‌ ఎమిరట్‌ వేదికగా గురువారం ఏసీసీ మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీ ఆరంభమైంది.

88 పరుగులకే ఆలౌట్‌
తొలి మ్యాచ్‌లో శ్రీలంక- మలేషియా అండర్‌-19 జట్లు తలపడ్డాయి. అల్‌ ఎమిరట్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మలేషియా 28.1 ఓవర్లలో కేవలం 88 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది.

ఆ ఒక్కడు తప్ప.. అందరూ సింగిల్‌ డిజిట్లకే
ఓపెనర్‌ స్యామిల్‌ అకిల్‌ అర్ధ శతకం (51)తో రాణించగా.. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం అయ్యారు. అసైరఫ్‌ మికేల్‌ (4), ఫిరాష్‌ తకుద్దీన్‌ (6), కెప్టెన్‌ డీజ్‌ పాట్రో (0), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలీప్‌ హాజిక్‌ (4), అయాధ్‌ ఇస్కందర్‌ (2), జుల్‌ సియామి (4), ఎన్‌. శాంతకుమారన్‌ (0), మహ్మద్‌ నుర్హానిఫ్‌ (4), నూర్‌ ఇమాన్‌ (1)ఇలా వచ్చి అలా వెళ్లగా.. ఆర్యన్‌ ఇస్కందర్‌ నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవలేకపోయాడు.

రేహాన్‌ పీరిస్‌ హాఫ్‌ సెంచరీ
శ్రీలంక యువ బౌలర్లలో కౌశిక కుమారసింఘే ఐదు వికెట్లతో చెలరేగి మలేషియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. విఘ్నేశ్వరర్‌ ఆకాశ్‌ మూడు, చనిరు సేనారత్నె ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే కెప్టెన్‌ విరాన్‌ చముదిత (0) వికెట్‌ కోల్పోయింది. శాంతకుమార్‌ చముదితను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

అయితే, మరో ఓపెనర్‌ రేహాన్‌ పీరిస్‌ (45 బంతుల్లో 54), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సెనుజ వెకునగొడ (35 బంతుల్లో 30) ఆడుతూ పాడుతూ పనిపూర్తి చేశారు. కేవలం 13.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 91 పరుగులు చేసిన శ్రీలంక.. మలేషియాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

ఇవీ చదవండి: IND vs NZ: ‘అతడు తుదిజట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఉండదు’
పృథ్వీ షా మెరుపులు.. పది వికెట్ల తేడాతో ఘన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement