రంజీ ట్రోఫీలో సంచ‌ల‌నం.. సౌరాష్ట్ర‌ను చిత్తు చేసిన త్రిపుర‌ | Ranji Trophy 2026-27: Tripura stuns former champion Saurashtra | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2026-27: రంజీ ట్రోఫీలో సంచ‌ల‌నం.. సౌరాష్ట్ర‌ను చిత్తు చేసిన త్రిపుర‌

Nov 5 2026 1:57 PM | Updated on Nov 5 2026 1:57 PM

Ranji Trophy 2026-27: Tripura stuns former champion Saurashtra

రంజీ ట్రోఫీ 2026-27 సీజ‌న్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. ఎలైట్ గ్రూప్‌-బిలో భాగంగా జ‌రిగిన మ్యాచ్‌లో మాజీ ఛాంపియ‌న్ సౌరాష్ట్ర‌ను 133 ప‌రుగుల తేడాతో త్రిపుర చిత్తు చేసింది. 342 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర కేవ‌లం 208 ర‌న్స్‌కే ఆలౌటైంది. 

ఈ భారీ ల‌క్ష్య చేధ‌న‌లో సౌరాష్ట్ర‌ను త్రిపుర ఆఫ్ స్పిన్న‌ర్ సందీప్ సర్కార్ దెబ్బ‌తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల‌తో చెల‌రేగిన సందీప్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్ల‌తో అద‌ర‌గొట్టాడు. మొత్తంగా 8 వికెట్లు ప‌డ‌గొట్టి త్రిపురకు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. 

సౌరాష్ట్ర బ్యాటర్లలో అర్పితా వాసవడ (189 బంతుల్లో 89 పరుగులు) ఒక్కడే అర్ధ సెంచరీతో పోరాడాడు చివరి వికెట్‌గా అతడిని మణిశంకర్ మురాసింగ్ రనౌట్ చేయడంతో త్రిపుర విజ‌యం లాంఛ‌న‌మైంది.

సంక్షిప్త స్కోర్లు
త్రిపుర (1వ ఇన్నింగ్స్): 313/10 (శ్రీదామ్ పాల్ 86)

సౌరాష్ట్ర (1వ ఇన్నింగ్స్): 182/10 (సందీప్ సర్కార్ 4/48)

త్రిపుర (2వ ఇన్నింగ్స్): 210/10 (శ్రీదామ్ పాల్ 50)

సౌరాష్ట్ర (2వ ఇన్నింగ్స్): 208/10 (అర్పితా వాసవడ 89, సందీప్ సర్కార్ 4/81)

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శ్రీదామ్ పాల్ (86 & 50)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement