PC: BCCI/X
టీమిండియా స్టార్ ప్లేయర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 విజయం తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన సూర్య.. తన ఫామ్‌ను తిరిగి అందుకునేందుకు ముంబై తరఫున వైట్‌బాల్ క్రికెట్ ఆడనున్నట్లు సమాచారం.
రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT), విజయ్ హజారే ట్రోఫీ (VHT)లలో అతడు ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతేకాకుండా, జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా సూర్యకే అప్పగించాలని ముంబై సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
వాస్తవానికి 2026-27 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉంటానని సూర్యకుమార్ తెలిపినప్పటికీ.. ఇటీవల రెడ్-బాల్ (సుదీర్ఘ ఫార్మాట్) ప్రాక్టీస్ లేదనే కారణంతో అతడిని ముంబై సెలెక్టర్లు పక్కన పెట్టారు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గతేడాది ముంబై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
గత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టగా, విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో కర్ణాటక చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా దేశవాళీ వైట్‌బాల్ టోర్నీల్లో ఛాంపియన్‌గా నిలవాలన్న పట్టుదలతో ముంబై ఉంది. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది.
చదవండి: IND vs NZ: ‘అతడు తుదిజట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఉండదు’


