చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్ | Ishan Kishan-Fear-3rd Indian Batter-Fewest balls-To-2000 T20I Runs | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

Nov 1 2026 1:41 PM | Updated on Nov 1 2026 1:46 PM

Ishan Kishan-Fear-3rd Indian Batter-Fewest balls-To-2000 T20I Runs

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో వన్‌డౌన్‌లో వచ్చిన టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో టీ20లో డకౌట్ అయిన ఇషాన్ ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం దుమ్మురేపాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న ఇషాన్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 

అదేంటంటే, టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 2వేల పరుగులు పూర్తి చేయడానికి తక్కువ బంతులు తీసుకున్న మూడో బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. ఇషాన్ 1345 బంతుల్లో 2వేల పరుగుల మార్క్ చేరుకున్నాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ (1024 బంతులు) తొలి స్థానంలో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ (1164 బంతులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

👉ఇదే సమయంలో ఇషాన్‌ కిషన్‌ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా తరఫున టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ 2022 ఏడాదిలో 1164 పరుగులు సాధించాడు. తాజాగా సూర్య రికార్డును బద్దలుకొట్టిన ఇషాన్ ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్‌లో 1220 పరుగులు సాధించాడు.

మ్యాచ్ విషయానికొస్తే 11 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (44), తిలక్‌ వర్మ (2)క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇషాన్‌ కిషన్‌ 31 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటవ్వగా, ఓపెనర్లు అభిషేక్‌ (1), సామ్సన్‌ (4) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

 

ఇదీ చదవండి:  ‘అందరినీ సంతోషపెట్టడం నా పని కాదు’ 

రోహిత్ శ‌ర్మ కీల‌క నిర్ణ‌యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement