Photo Credit: Twitter
సొంతగడ్డపై ఆస్ట్రేలియాను 2-1 తేడాతో చిత్తు చేసిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకొని డబ్ల్యూటీసీ పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అరుదైన ఫీట్‌తో చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బవుమా 15 టెస్టుల్లో 13 విజయాలు, ఒక డ్రా అందుకొని, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓటమి చవిచూశాడు.
బవుమా విజయాల శాతం (86.66 శాతం) ఉండడం విశేషం. తద్వారా డబ్ల్యూటీసీ సైకిల్‌లో టెస్టు కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న జాబితాలో బవుమా ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ (12 విజయాలు) రికార్డును బద్దలుకొట్టి అతడిని అధిగమించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (26 విజయాలు), బెన్ స్టోక్స్ (21 విజయాలు), జో రూట్ (15 విజయాలు), కోహ్లి (14 విజయాలు) బవుమా కంటే ముందున్నారు.
అయితే అత్యధిక విజయ శాతమున్న కెప్టెన్ల పరంగా మాత్రం బవుమా అగ్రస్థానంలో నిలిచాడు. బువుమా 15 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో 86.66 శాతం సక్సెస్‌రేటు కలిగి ఉన్నాడు. బవుమా తర్వాత కమిన్స్ (60.46 శాతం) రెండో స్థానంలో, కోహ్లి (63.63 శాతం) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌పై బవుమాకు ఇది మూడో విజయం. గతంలో 2025 డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఈ సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన బవుమా.. కమిన్స్‌పై అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్‌గా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు), స్టోక్స్ (6 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఇక బుమ్రా, కరుణరత్నేలు (రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో విజయం) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి: రెండు విజయాలతో మొత్తం తారుమారు.. డబ్ల్యూటీసీలో మార్పులు!


