ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో షాద్మాన్ ఇస్లాం(105), తౌహిద్ హ్రిదోయ్(42) మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బతీశాడు. అనంతరం విండీస్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. కరేబియన్ జట్టు 245 పరుగులకే ఆలౌటైంది. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ (56 పరుగులు), జాన్ క్యాంప్‌బెల్ (54 పరుగులు) అర్ధసెంచరీలతో రాణించారు.
బంగ్లా బౌలర్లలో స్పిన్నర్ నయీమ్ హసన్ 4 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాకు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లా బ్యాటర్ల ఆటతీరు ఏ మాత్రం మారలేదు. బంగ్లాదేశ్ జట్టు కేవలం 142 పరుగులకే ఆలౌటైంది.
విండీస్ స్పిన్నర్లు చేజ్ 5 వికెట్లు, జోమెల్ వారికన్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఉంచింది. ఈ లక్ష్యాన్ని విండీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. బ్రాండెన్ కింగ్(81) అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించాడు. ఇరు జట్ల మద్య రెండో టెస్టు నవంబర్ 5 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: సౌతాఫ్రికా పేసర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర


