హాంగ్ కాంగ్ సిక్స్సెస్ 2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. శనివారం మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో యూఏఈను 53 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్‌కు ఆసీస్ దూసుకెళ్లింది.
ఈ సెమిస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆసీస్ బ్యాటర్లు మ్యాక్స్ బ్రయంట్, నిక్ హాబ్సన్ మరోసారి విధ్వంసం సృష్టించారు.
బ్రయంట్ కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60 పరుగులు చేయగా.. హాబ్సన్ 11 బంతుల్లో (4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 రన్స్) హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ జుహైబ్ ఒక్కడే వికెట్ సాధించాడు. మిగితా ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం 142 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 5.3 ఓవర్లలో కేవలం 88 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో క్రిస్ గ్రీన్, అలెక్స్ రోస్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ వుడ్, బ్రయంట్ తలా వికెట్ సాధించారు.
చదవండి: విండీస్ కెప్టెన్ అరుదైన ఫీట్.. బంగ్లాతో టెస్టులో విజయం దిశగా!


