విండీస్ కెప్టెన్ అరుదైన ఫీట్‌.. బంగ్లాతో టెస్టులో విజ‌యం దిశ‌గా! | WI Skipper-Roston-Chase-100 Test Wkts-Joins-Elite List-Vs BAN 1st Test | Sakshi
Sakshi News home page

విండీస్ కెప్టెన్ అరుదైన ఫీట్‌.. బంగ్లాతో టెస్టులో విజ‌యం దిశ‌గా!

Oct 31 2026 12:13 PM | Updated on Oct 31 2026 12:37 PM

WI Skipper-Roston-Chase-100 Test Wkts-Joins-Elite List-Vs BAN 1st Test

Photo Credit: Twitter

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జ‌ట్టు విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తుంది. 170 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు లంచ్ స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 8 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు 79-6 క్రితంరోజు స్కోరుతో ఆట‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 142 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. 

విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో బంగ్లా బ్యాట‌ర్లు తోక‌ముడిచారు. అయితే న‌యీమ్ హ‌స‌న్ (91 బంతుల్లో 52) టెస్టుల్లో తొలి అర్థ‌శ‌త‌కం సాధించ‌గా, జాక‌ర్ అలీ (22) ప‌ర్వాలేద‌నిపించాడు. వెస్టిండీస్ బౌల‌ర్లలో రోస్ట‌న్ చేజ్ ఐదు వికెట్లు తీయ‌గా, జోమెల్ వ‌రిక‌న్ నాలుగు, ష‌మ‌ర్ జోసెఫ్ ఒక వికెట్ తీశాడు. అంత‌క‌ముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 272 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

వంద వికెట్లు పూర్తి చేసుకున్న చేజ్‌
వెస్టిండీస్ కెప్టెన్ రోస్ట‌న్ చేజ్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ నేప‌థ్యంలో విండీస్ కెప్టెన్ చేజ్ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 2 వేల ప‌రుగులు, వంద వికెట్ల మార్క్‌ను చేరుకున్న నాలుగో విండీస్ ఆల్‌రౌండ‌ర్‌గా చేజ్ రికార్డుల‌కెక్కాడు. 

గ‌తంలో స‌ర్ గార్‌ఫీల్డ్ సోబ‌ర్స్ (8,032 ప‌రుగులు, 235 వికెట్లు), కార్ల్ హూప‌ర్ (5,672 ప‌రుగులు, 114 వికెట్లు), జాస‌న్ హోల్డ‌ర్ (3,073 ప‌రుగులు, 162 వికెట్లు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. తాజాగా వీరి స‌ర‌స‌న చేజ్ చోటు సంపాదించాడు. ఓవ‌రాల్‌గా రోస్ట‌న్ చేజ్ 62 టెస్టుల్లో 101 వికెట్లు, 2,852 ప‌రుగులు సాధించాడు.

ఇదీ చదవండి: తొలిరోజు ముగిసిన ఆట‌; సెంచ‌రీకి అడుగు దూరంలో భారత కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement