న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పు | BCCI Added Auqib Nabi-To-India-Squad 1st-Three-ODIs vs New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టులో కీలక మార్పు

Oct 31 2026 10:46 AM | Updated on Oct 31 2026 11:18 AM

BCCI Added Auqib Nabi-To-India-Squad 1st-Three-ODIs vs New Zealand

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు సంబంధించి టీమిండియా జ‌ట్టులో బీసీసీఐ కీల‌క మార్పు చేసింది.  న‌వంబ‌ర్ 4 నుంచి మొదలుకానున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మూడు వ‌న్డేల‌కు అకిబ్ న‌బీని జ‌ట్టులోకి ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. అయితే అకిబ్ న‌బీ ఇప్ప‌టికే చివ‌రి రెండు వ‌న్డేల‌కు జ‌ట్టుకు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. 

గాయ నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ప్ర‌సిధ్ క్రిష్ణ కివీస్‌తో సిరీస్‌కు దూరం కావ‌డంతో అకిబ్ న‌బీ పేరును తొలి మూడు వ‌న్డేల‌కు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. దీంతో న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ప్ర‌క‌టించిన రెండు వేర్వేరు జ‌ట్ల‌లో అకిబ్ న‌బీ చోటు సంపాదించాడు. రోహిత్‌, కోహ్లి, శ్రేయ‌స్‌, ఇషాన్ కిష‌న్‌, న‌మ‌న్‌ధీర్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌ల‌తో పాటు అకిబ్ న‌బీ కూడా కివీస్‌తో వ‌న్డే సిరీస్‌కు అందుబాటులో ఉండ‌నున్నాడు.

లంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక
బారాముల్లాకు చెందిన అకిబ్ న‌బీ ఈ ఏడాది ఆగ‌స్టులో శ్రీలంక‌తో జ‌రిగిన టెస్టు సిరీస్ ద్వారా తొలిసారి టీమిండియాకు ఎంపిక‌య్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌లో జ‌మ్మూ క‌శ్మీర్ త‌ర‌ఫున 60 వికెట్ల‌తో స‌త్తా చాటిన ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌ బుమ్రా స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చాడు. అయితే వెస్టిండీస్‌తో గుహ‌వాటి వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డే ద్వారా అకిబ్ న‌బీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 

విండీస్‌తో వన్డేతో అరంగేట్రం..
తాను ఆడిన తొలి మ్యాచ్‌లో 8.5 ఓవ‌ర్లు బౌలింగ్ వేసి 84 ప‌రుగులు స‌మ‌ర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో అకిబ్ న‌బీ భాగం కాన‌ప్ప‌టికీ, కివీస్‌-ఏ జ‌ట్టుతో భార‌త్-ఏ త‌ర‌ఫున తొలి అన‌ధికారిక టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే నేడు ప్రారంభ‌మైన రెండో అన‌ధికారిక టెస్టుకు మాత్రం అకిబ్ న‌బీ ఎంపిక‌వ్వ‌లేదు. తాజాగా వ‌న్డే సిరీస్‌కు ఎంపికవ్వ‌డంతో అకిబ్ న‌బీ ఇప్ప‌టికే సీనియ‌ర్ జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ ఆరంభించాడు.

మొదటి మూడు వన్డేలకు భారత జట్టు (అప్‌డేట్‌)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), మహ్మద్ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, నితీశ్‌ రెడ్డి (మొదటి వన్డేకు మాత్రమే), అకిబ్ న‌బీ.

నాలుగు, ఐదో వన్డేలకు భారత జట్టు (అప్‌డేట్‌)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌, వైస్‌ కెప్టెన్‌), అక్షర్ పటేల్, నమన్ ధీర్, అకిబ్  న‌బీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్‌ కీపర్‌), మహ్మద్ సిరాజ్, యశ్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌

ఇదీ చదవండి: న‌ట‌రాజన్ సిక్స‌ర్లు వృథా; టీమిండియాకు షాకిచ్చిన యూఏఈ

ఆసీస్‌ టార్గెట్‌ 288.. చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాట‌ర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement