ఆసీస్‌ టార్గెట్‌ 288.. చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాట‌ర్లు | Two-South Africa-Batters-Centuries-Batting-No6-or Lower-Vs AUS 2nd Test | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ టార్గెట్‌ 288.. చ‌రిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాట‌ర్లు

Oct 31 2026 9:03 AM | Updated on Oct 31 2026 9:36 AM

Two-South Africa-Batters-Centuries-Batting-No6-or Lower-Vs AUS 2nd Test

Photo Credit: Twitter

కేప్‌టౌన్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్టులో సౌతాఫ్రికా గెలుస్తుందా? ఓడుతుందా అన్న‌ది చివ‌రిరోజు ఆట‌లో తేలిపోనుంది. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 387 ప‌రుగుల‌కు ఆలౌటైంది. లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో రియాన్ రికిల్‌ట‌న్ (219 బంతుల్లో 101; 12 ఫోర్లు), వియాన్ ముల్డ‌ర్ (221 బంతుల్లో 115; 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో సౌతాఫ్రికా కోలుకుంది. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 318 బంతుల్లో 154 పరుగులు జోడించారు.

మిగ‌తా బ్యాట‌ర్ల‌లో మార్కస్ అకెర్‌మ‌న్ (62) అర్థ‌శ‌త‌కం సాధించ‌గా, మాథ్యూ బ్రీట్జ్‌కే (43) ప‌ర్వాలేద‌నిపించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయ‌గా, క‌మిన్స్‌, లియోన్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ఇవాళ ఆట‌కు చివ‌రి రోజు కాగా.. ఆస్ట్రేలియా ముంగిట సౌతాఫ్రికా 288 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. 

గ‌తంలో 2002లో ఇదే కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో సౌతాఫ్రికా నిర్దేశించిన 331 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్ ఛేదించ‌డం విశేషం. త‌న‌కు అచ్చొచ్చిన మైదానంలో 288 ప‌రుగుల టార్గెట్‌ను ఆసీస్ ఛేదిస్తుందా లేక స‌ఫారీ బౌల‌ర్ల ధాటి చ‌తికిల‌ప‌డుతుందా అన్న‌ది చూడాలి.

ఇక సెంచ‌రీల‌తో చెల‌రేగిన వియాన్ ముల్డ‌ర్‌, రియాన్ రికిల్‌ట‌న్ స‌రికొత్త ఫీట్ న‌మోదు చేశారు. టెస్టు ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా త‌ర‌ఫున‌ ఆరు లేదా ఆ త‌ర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి సెంచ‌రీలు బాదిన జాబితాలో ఈ జోడీ చోటు ద‌క్కించుకుంది.

గ‌తంలో 1955లో మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో టెస్టులో జాన్ వైట్ (113), పాల్ విన్‌స్లో (108) సెంచ‌రీలు సాధించ‌గా; 1997లో కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్‌తో టెస్టులో బ్రియాన్ మెక్‌మిల‌న్ (103 నాటౌట్‌), లాన్స్ క్లూసెన‌ర్ (102 నాటౌట్‌); 2013లో గెబెర్హా వేదిక‌గా న్యూజిలాండ్‌తో టెస్టులో ఫాప్ డుప్లెసిస్ (137), డీన్ ఎల్గ‌ర్ (103 నాటౌట్‌); తాజాగా రికిల్‌ట‌న్, వియాన్ ముల్డ‌ర్ ద్వయం ఈ ఫీట్ సాధించారు.

ఇదీ చదవండి: లంక‌ను చావుదెబ్బ తీసిన స్కాట్లాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement