source: X
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మూడో టీ20లో ఒక వికెట్ పడగొట్టిన అతడు.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో (టెస్టు హోదా కలిగిన దేశాల బౌలర్లలో) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఐర్లాండ్ పేసర్ జాషువ లిటిల్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు.
2022లో లిటిల్ 39 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ ఈ ఏడాది 30 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు సాధించాడు. అర్షదీప్ ఈ ఏడాది మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండటంతో సోలోగా ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు.
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అర్ష్‌దీప్ నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే కైవసం చేసుకుంది.
150 వికెట్ల మైలురాయికి అడుగు దూరంలో..
2022లో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. ఇప్పటివరకు 102 మ్యాచ్‌ల్లో 149 వికెట్లు తీశాడు. మరో వికెట్ తీస్తే 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
అభిషేక్ శర్మ విధ్వంసం.. భారత్ విజయం
మూడో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
ఇదీ చదవండి: అభిషేక్ విధ్వంసకర సెంచరీ, వైభవ్ ధనాధన్.. కివీస్ చిత్తు


