ఆక్లాండ్ చేరుకున్న‌ టీమిండియా; జ‌ట్టును వీడిన కుమార్ కుశాగ్రా! | India Arrives Auckland-Kumar Kushagra Joined INDA-Play-Unofficial Test Series | Sakshi
Sakshi News home page

ఆక్లాండ్ చేరుకున్న‌ టీమిండియా; జ‌ట్టును వీడిన కుమార్ కుశాగ్రా!

Oct 28 2026 11:35 AM | Updated on Oct 28 2026 12:26 PM

India Arrives Auckland-Kumar Kushagra Joined INDA-Play-Unofficial Test Series

PC: X (Twitter)

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్ప‌టికే మూడింటిని నెగ్గిన టీమిండియా 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్ర‌వారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ వేదిక‌గా నాలుగో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త జ‌ట్టు బుధ‌వారం ఉద‌యం ఆక్లాండ్‌లో అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 


PC: X (Twitter)

కాగా తొలి టీ20లో గాయ‌ప‌డిన ఇషాన్ కిష‌న్ రెండు, మూడు టీ20ల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డి స్థానంలో కుమార్ కుశాగ్ర‌ను బ్యాక‌ప్‌గా ఎంపిక చేశారు. అయితే తుది జ‌ట్టులో మాత్రం కుశాగ్ర‌కు చోటు ద‌క్క‌లేదు. తాజాగా ఇషాన్ కిష‌న్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని నాలుగో టీ20 ఆడేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో కుమార్ కుశాగ్ర టీమిండియాను వీడాడు. మరి నాలుగో టీ20కి జట్టులో మార్పులు ఉంటాయా లేక అదే జట్టును కొనసాగిస్తారా అన్నది చూడాలి.


PC: X (Twitter)

టీమిండియాను వీడిన కుమార్ కుశాగ్ర వెంటనే ఇండియా-ఏ జ‌ట్టుతో క‌లిశాడు. ఇప్ప‌టికే మూడు మ్యాచ్‌ల‌ అన‌ధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భార‌త‌-ఏ జ‌ట్టు న్యూజిలాండ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇరుజ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తొలి అన‌ధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. కేఎల్ రాహుల్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, దేవ‌ద‌త్ ప‌డిక్కల్‌, ధ్రువ్ జురేల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ తొలి టెస్టులో పాల్గొన్నారు. 


PC: X (Twitter)

టీమిండియా టెస్టు జ‌ట్టులో భాగ‌మైన వీరింద‌రిలో ప‌డిక్క‌ల్ ఒక్క‌డే ఆక‌ట్టుకున్నాడు. ఇక న్యూజిలాండ్‌-ఏ, భార‌త్‌-ఏల మ‌ధ్య రెండో అన‌ధికారిక టెస్టు అక్టోబ‌ర్ 31 నుంచి క్రైస్ట్‌చ‌ర్చి వేదిక‌గా మొద‌లుకానుంది. 

 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement