breaking news
Kumar Kushagra
-
కెప్టెన్ ఇషాన్ కిషన్ కొట్టేశాడు!
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 టైటిల్‌ను జార్ఖండ్ గెలుచుకుంది. హర్యానాతో గురువారం నాటి ఫైనల్లో గెలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో దేశీ టోర్నీల్లో ఓవరాల్‌గా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది.పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా టైటిల్ పోరులో హర్యానా- జార్ఖండ్ (Haryana Vs Jharkhand) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హర్యానా.. జార్ఖండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.101 పరుగులుమరో ఓపెనర్ విరాట్ సింగ్ (2) విఫలమైనా.. ఇషాన్ (Ishan Kishan) మాత్రం నిలకడగా ఆడాడు. 45 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 49 బంతుల్లో ఆరు ఫోర్లు, పది సిక్స్‌లు బాది 101 పరుగులు సాధించాడు. ఇతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా మెరుపు హాఫ్ సెంచరీ (38 బంతుల్లో 81)తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 177 పరుగులు జోడించారు.ధనాధన్ ఇన్నింగ్స్‌అనంతరం అనుకుల్ రాయ్ (20 బంతుల్లో 40), రాబిన్ మింజ్ (14 బంతుల్లో 31) కూడా ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో జార్ఖండ్ మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 262 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సమంత్ జేఖర్, సుమిత్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 18.3 ఓవర్లో 193 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జార్ఖండ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్లలో అర్ష్ రంగా (17) ఓ మోస్తరుగా ఆడగా.. కెప్టెన్ అంకిత్ కుమార్, వన్‌డౌన్‌లో వచ్చిన ఆశిష్ సివాజ్ డకౌట్ అయ్యారు.పోరాడిన మిడిలార్డర్ఇలాంటి దశలో మిడిలార్డర్లో యశ్వర్ధన్ దలాల్ (22 బంతుల్లో 53), నిషాంత్ సింధు (15 బంతుల్లో 31), సమంత్ జేఖర్ (17 బంతుల్లో 38) ధనాధన్ ఆడి.. ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, జార్ఖండ్ బౌలర్లు వారిని వరుస విరామాల్లో పెవిలియన్‌కు పంపారు.ఆఖర్లో పార్త్ వట్స్ (4), సుమిత్ కుమార్ (5), అన్షుల్ కాంబోజ్ (11) తడబడగా.. అమిత్ రాణా (13 నాటౌట్), ఇషాంత్ భరద్వాజ్ (17) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. హర్యానా 193 పరుగులకే ఆలౌట్ కావడంతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో గెలిచింది.జార్ఖండ్ బౌలర్లలో సుశాంత్ మిశ్రా, బాల్ క్రిష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. వికాస్ సింగ్, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. కాగా గతంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2010-11 టైటిల్ గెలుచుకున్న జార్ఖండ్.. తాజాగా ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో దేశీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు That winning feeling! 🥳Time for celebration in the Jharkhand camp as they win the Syed Mushtaq Ali Trophy for the first time 🙌Scorecard ▶️ https://t.co/3fGWDCTjoo#SMAT | @IDFCFIRSTBank pic.twitter.com/qJB0b2oS0Y— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
ఫైనల్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకం.. వీడియో
దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్-2025 ముగింపు దశకు చేరుకుంది. పుణె వేదికగా గురువారం నాటి ఫైనల్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో హర్యానాతో టైటిల్ పోరులో టాస్ ఓడిన జార్ఖండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.ఓపెనర్లలో విరాట్ సింగ్ (2) విఫలం కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హర్యానా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు.శతక్కొట్టిన ఇషాన్ కిషన్.. కుశాగ్రా ధనాధన్మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఆరు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, శతకం పూర్తి చేసుకున్న వెంటనే.. సుమిత్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (Kumar Kushagra) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 38 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 81 పరుగులు సాధించాడు.అనుకుల్, రాబిన్ మింజ్ ధనాధన్ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రాకు తోడు అనుకుల్ రాయ్, రాబిన్ మింజ్ ధనాధన్ దంచికొట్టారు. అనుకుల్ రాయ్ 20 బంతుల్లో 40 (3 ఫోర్లు, 2 సిక్స్‌లు).. రాబిన్ మింజ్ 14 బంతుల్లోనే 31 పరుగుల (3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచారు.ఫలితంగా హర్యానాతో ఫైనల్లో జార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ఏకంగా 262 పరుగులు సాధించింది. హర్యానా బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, సుమిత్ కుమార్, సమంత్ జేఖర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: IND vs SA: డబ్బు తిరిగి ఇచ్చేయండి.. స్పందించిన బీసీసీఐLeading from the front! 🫡Ishan Kishan with a magnificent hundred in the #SMAT final 💯The Jharkhand captain walks back for 1⃣0⃣1⃣(49) 👏Updates ▶️ https://t.co/3fGWDCTjoo@IDFCFIRSTBank | @ishankishan51 pic.twitter.com/PJ7VI752wp— BCCI Domestic (@BCCIdomestic) December 18, 2025 -
శతక్కొట్టిన మావీ.. కుషాగ్రా డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 9) చాలామంది ప్లేయర్లు సత్తా చాటారు. యూపీ ఆటగాడు శివమ్ మావీ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జార్ఖండ్ ఆటగాడు కుమార్ కుషాగ్రా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. జమ్యూ కశ్మీర్ ఆటగాడు పరస్ డోగ్రా కెరీర్లో 34వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు.మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరీ 8 బంతుల్లో వరుసగా సిక్సర్లు బాది 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరూ వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదలేదు.హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ సూపర్ సెంచరీతో మెరిశాడు. బెంగాల్ ఆటగాడు సుమంత్ గుప్తా, చత్తీస్ఘడ్ ఆటగాడు మయాంక్ వర్మ కెరీర్లో తొలి సెంచరీలు నమోదు చేశారు. మణిపూర్ ప్లేయర్ అల్ బషిద్ సెంచరీతో మెరిశాడు. త్రిపురకు ఆడుతున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారీ శతకంతో కదంతొక్కాడు. మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా తన 26వ బర్త్ డే రోజున అర్ద సెంచరీతో రాణించాడు.బౌలింగ్ విషయానికొస్తే.. కర్ణాటక శ్రేయస్ గోపాల్, తమిళనాడు సందీప్ వారియర్, సౌరాష్ట్ర కెప్టెన్ జయదేశ్ ఉనద్కత్, బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు తలో నాలుగు వికెట్లతో సత్తా చాటారు. గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: సూపర్ ఫామ్‌లో పృథ్వీ షా -
రూ. 10 కోట్లదాకా వెళ్తామని గంగూలీ మాటిచ్చారు.. ఇలా అనుకోలేదు!
IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ వల్ల వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారు. దేశవాళీ క్రికెట్, సెలక్షన్ క్యాంపులలో అసాధారణ ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం చెల్లించేందుకు కూడా సిద్ధపడతాయన్న విషయం తెలిసిందే. తమ జట్టుకు సదరు ఆటగాడు ఉపయోగపడతాడని భావిస్తే కనీస ధరతో సంబంధం లేకుండా కోట్ల వర్షం కురిపించిన దాఖలాలు కోకొల్లలు. ఐపీఎల్-2024 వేలం సందర్భంగా ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఓ అన్క్యాప్డ్ ప్లేయర్. రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చి ఏకంగా రూ. 7.20 కోట్లు కొల్లగొట్టాడు. అతడి పేరు కుమార్ కుషాగ్ర. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో పోటీ పడి మరీ ఈ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అయితే, దీనంతటికి క్యాపిటల్స్ మెంటార్ సౌరవ్ గంగూలీనే కారణం అంటున్నాడు కుషాగ్ర తండ్రి శశికాంత్. ధోనిలా వికెట్ కీపింగ్ చేస్తున్నాడంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ట్రయల్స్ సందర్భంగా గంగూలీ కుషాగ్రతో మాట్లాడారు. నీకోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 10 కోట్ల వరకు ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడుతుందని కుషాగ్రకు చెప్పారు. నిజానికి ట్రయల్స్‌లో భాగంగా కుషాగ్ర సిక్సర్లు బాదడం చూసి గంగూలీ ముచ్చటపడ్డారు. వికెట్ కీపింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. అంతేకాదు.. కుషాగ్ర మహేంద్ర సింగ్ ధోని మాదిరే బెయిల్స్‌ను హిట్ చేస్తున్నాడంటూ కొనియాడారు. ఉత్సాహపరిచేందుకు చెప్తున్నారనుకున్నా గానీ.. ఇలా అనుకోలేదు వేలంలో కుషాగ్రను ఢిల్లీ కనీస ధరకే కొనుగోలు చేస్తుందని భావించాం. అయితే, ఆ తర్వాత అద్భుతాలు జరిగాయి. గంగూలీ మాట ఇచ్చినట్లుగానే ఇతర జట్లతో పోటీ పడీ మరీ మా వాడిని కొనుగోలు చేసేలా చేశారు. జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ కుషాగ్రకు ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది. తను ఇక్కడిదాకా చేరుకోవడం గర్వంగా ఉంది’’ అని శశికాంత్ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్ర. గతేడాది రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏకంగా 266 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. రంజీ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 250కి పైగా రన్స్ చేసిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ, దేళవాళీ టీ20 క్రికెట్లోనూ సత్తా చాటాడు. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి కాసుల వర్షంలో తడిశాడు. చదవండి: తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు


