రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 9) చాలామంది ప్లేయర్లు సత్తా చాటారు. యూపీ ఆటగాడు శివమ్ మావీ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జార్ఖండ్ ఆటగాడు కుమార్ కుషాగ్రా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. జమ్యూ కశ్మీర్ ఆటగాడు పరస్ డోగ్రా కెరీర్‌లో 34వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు.
మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరీ 8 బంతుల్లో వరుసగా సిక్సర్లు బాది 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరూ వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదలేదు.
హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ సూపర్ సెంచరీతో మెరిశాడు. బెంగాల్ ఆటగాడు సుమంత్ గుప్తా, చత్తీస్‌ఘడ్ ఆటగాడు మయాంక్ వర్మ కెరీర్‌లో తొలి సెంచరీలు నమోదు చేశారు. మణిపూర్ ప్లేయర్ అల్ బషిద్ సెంచరీతో మెరిశాడు.
త్రిపురకు ఆడుతున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారీ శతకంతో కదంతొక్కాడు. మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా తన 26వ బర్త్ డే రోజున అర్ద సెంచరీతో రాణించాడు.
బౌలింగ్ విషయానికొస్తే.. కర్ణాటక శ్రేయస్ గోపాల్, తమిళనాడు సందీప్ వారియర్, సౌరాష్ట్ర కెప్టెన్ జయదేశ్ ఉనద్కత్, బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు తలో నాలుగు వికెట్లతో సత్తా చాటారు. గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్‌జీత్ సింగ్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
చదవండి: సూపర్ ఫామ్‌లో పృథ్వీ షా


