సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుని జోష్‌లో ఉంది ఆస్ట్రేలియా. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి.. మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నామమాత్రపు నాలుగో, ఐదు టెస్టులలోనూ సత్తా చాటి వైట్‌వాష్ చేయాలని పట్టుదలగా ఉంది.
మరోసారి స్మిత్ సారథ్యంలో
కాగా ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు (Aus Vs Eng Boxing Day Test) జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins)కు విశ్రాంతినివ్వగా.. మరోసారి స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథిగా వ్యవహరించనున్నాడు. తొలి రెండు టెస్టుల మాదిరే ఈసారీ గెలుపు రుచి చూడాలని స్మిత్ భావిస్తున్నాడు.
ఆ ముగ్గురి మధ్య పోటీ
అయితే, కమిన్స్‌తో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ సైతం నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై కెప్టెన్ స్మిత్ అంచనాకు రాలేకపోయాడు. దీంతో పన్నెండు మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు స్థానాల కోసం పేసర్లు బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్‌సన్ మధ్య పోటీ ఉందని స్మిత్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
పిచ్‌కు అనుగుణంగా
పచ్చగా ఉన్న మెల్‌బోర్న్ పిచ్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాతే తాము తుదిజట్టును ఎంపిక చేసుకుంటామని స్మిత్ స్పష్టం చేశాడు. తద్వారా స్పిన్నర్ టాడ్ మర్ఫీకి మరోసారి మొండిచేయి తప్పదని సంకేతాలు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో 82, 40 పరుగులతో ఆకట్టుకున్న ఉస్మాన్ ఖవాజా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్‌కు మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.
బాక్సింగ్ డే టెస్టు (డిసెంబరు 26-30)కు ఆస్ట్రేలియా ప్లేయింగ్ XII
ట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా , అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, బ్రెండాన్ డాగెట్, మైకేల్ నాసర్, జే రిచర్డ్‌సన్.
బాక్సింగ్ డే టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, బ్రెండాన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, మైకేల్ నాసర్, జే రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
మరోవైపు ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల నొప్పితో దూరం కాగా.. ఓలీ పోప్‌ను తప్పించింది. వీరి స్థానాల్లో గస్ అట్కిన్సన్, జేకబ్ బెతెల్ వచ్చారు.
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు
జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బెతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్.
చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!


