breaking news
Ashes 2025- 26
-
యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్.. కెప్టెన్ అవుట్!
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఈ మేజర్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెన్నుపాము దిగువ భాగంలో నొప్పితో కమిన్స్ కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.నెలలుగా ఆటకు దూరంజూన్- జూలైలో ఆసీస్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లగా కమిన్స్ మాత్రం ఫిట్నెస్ సమస్యలతో స్వదేశంలోనే ఉండిపోయాడు. అప్పటి నుంచి ఇంత వరకు మళ్లీ మైదానంలో దిగలేదు. అంతేకాదు.. అక్టోబరులో న్యూజిలాండ్, టీమిండియాలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా కమిన్స్ దూరమయ్యాడు.ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌కు తగినంత విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్.. తమ కెప్టెన్ విషయంలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంది. అయితే, తాను యాషెస్ కూడా ఆడతానో లేదో అంటూ కమిన్స్ తాజాగా బాంబు పేల్చాడు.ఆడతానో.. లేదో!.. వేచి చూద్దాంవిలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నా. అయితే, గాయం నుంచి వంద శాతం కోలుకున్నానని చెప్పలేను. యాషెస్ నుంచి మళ్లీ మైదానంలో దిగాలనే ఆశిస్తున్నా.అయితే, ఈ విషయంపై ఇప్పుడే స్పష్టత మాత్రం ఇవ్వలేను. యాషెస్‌లో ఆడాలనే భావిస్తున్నా. ఐదు టెస్టులు ఆడతానో లేదో ఇపుడే చెప్పడం కష్టం. మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కాగా ఈసారి ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య నవంరు 21- జనవరి 8 వరకు ఐదు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.యాషెస్ సిరీస్ 2025 షెడ్యూల్ ఇదే👉తొలి టెస్టు: నవంబరు 21- 25- పెర్త్👉రెండో టెస్టు: డిసెంబరు 4- 8- బ్రిస్బేన్👉మూడో టెస్టు: డిసెంబరు 17- 21- అడిలైడ్👉నాలుగో టెస్టు: డిసెంబరు 26- 30- మెల్బోర్న్👉ఐదో టెస్టు: జనవరి 4- 8- సిడ్నీ.చదవండి: IND vs AUS: భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్.. ఆసీస్‌కు ధీటుగా.. -
రూట్ ఒక్క సెంచరీ చెయ్.. లేదంటే మా నాన్న అన్నంత పనిచేస్తాడు: హేడెన్ కుమార్తె
సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్‌కున్న ప్రత్యేకత, విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 141 సంవత్సరాల చరిత్ర గల ఈ సిరీస్‌లో మరోసారి ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమవుతున్నాయి. ఈ ఏడాది యాషెస్ సిరీస్ నవంబర్ నుంచి జనవరి 8, 2026 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌కు ఈసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.ఈ సిరీస్ ఆరంభానికి ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు మాత్రం తమ సవాల్లతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్.. ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. "యాషెస్ సిరీస్‌లో జో రూట్ కనీసం ఒక సెంచరీ అయినా సాధించకపోతే మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో నగ్నంగా నడుస్తా" అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బోల్డ్ ఛాలెంజ్‌పై హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్ స్పందించింది. "ప్లీజ్ రూట్ ఒక్కసెంచరీ చేయండి.. లేదంటే మా నాన్న అన్నంత పని చేస్తాడు" అని కామెంట్స్‌లో గ్రేస్ రాసుకొచ్చింది.ఒక్క సెంచరీ కూడా..వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్న జో రూట్.. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై కనీసం ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. ఏ ఫార్మాట్లోనూ అతడు సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు రూట్ 14 టెస్ట్ మ్యాచ్‌లు, 16 వన్డేలు, మూడు టీ20లు ఆడాడు.ఆసీస్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి రూట్ 9 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 91 నాటౌట్‌గా ఉంది. అయితే ఓవరాల్‌గా ఆసీస్‌పై రూట్‌కు మంచి రికార్డు ఉంది. రూట్ తన కరీర్లో కంగారులపై నాలుగు సెంచరీలు చేశాడు. అవన్నీ కూడా తన స్వదేశంలో వచ్చినవే కావడం గమానార్హం. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!?
యాషెస్ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండకపోవచ్చునని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ తర్వాత కమ్మిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే విండీస్‌తో టీ20 సిరీస్, సౌతాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లకు దూరమయ్యాడు. అయితే నవంబర్ 21 నుండి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ సమయానికి కమ్మిన్స్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అంచనా వేసింది. కానీ ఊహించిన దానికంటే అతడి వెన్ను నొప్పి తీవ్రంగా ఉన్నట్లు . డైలీ మెయిల్ ప్రకారం.. కమ్మిన్స్ తాజా స్కానింగ్‌లో వెన్ను గాయం తీవ్రత తెలిసినట్లు సమాచారంబుమ్రా బాటలో.. అయితే కమ్మిన్స్ టీమిండియా స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బాటలో నడిచే అవకాశమున్నట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో కమ్మిన్స్‌ను రెండు లేదా మూడు టెస్టులు మాత్రమే ఆడించాలని ఆసీస్ సెలక్టర్లు భావిస్తున్నరంట. బుమ్రా సైతం ఇటీవలే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్ భాగంగా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కమ్మిన్స్ విషయంలో కూడా అదే జరగొచ్చు.కాగా కమ్మిన్స్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో కమ్మిన్స్ ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇది ఇలా ఉండగా.. కమ్మిన్స్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినప్పటికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల్లోనూ ఈ స్టార్ పేసర్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమ్మిన్స్ భాగమయ్యాడు.2025-26 యాషెస్ సిరీస్ తేదీలు:పెర్త్ టెస్ట్ (వెస్ట్ టెస్ట్): పెర్త్ స్టేడియం | నవంబర్ 21-25బ్రిస్బేన్ టెస్ట్ (డే/నైట్ టెస్ట్): గబ్బా | డిసెంబర్ 4-8అడిలైడ్ టెస్ట్ (క్రిస్మస్ టెస్ట్): అడిలైడ్ ఓవల్ | డిసెంబర్ 17-21మెల్బోర్న్ టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్): | డిసెంబర్ 26-30సిడ్నీ టెస్ట్ (నూతన సంవత్సర టెస్ట్): ఎస్సీజీ | జనవరి 4-8చదవండి: IND vs AUS: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో పాసైన కెప్టెన్ -
కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు షాక్!
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్, టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) జట్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు.మూడు టీ20లుకాగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ (NZ vs AUS)లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్టోబరు 1, 3, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సిరీస్ మొత్తం మౌంట్మౌంగనీయ్లోని బే ఓవల్ మైదానంలోనే జరుగనుంది.ఇదిలా ఉంటే.. కమిన్స్ గత కొంతకాలంగా ఆసీస్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలో కంగారూ జట్టు కమిన్స్ లేకుండానే బరిలోకి దిగింది. తాజాగా అతడు కివీస్ జట్టుతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిసింది.టీమిండియాతో సిరీస్‌కు రెడీవెన్నునొప్పి కారణంగా కమిన్స్ న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని కోడ్ స్పోర్ట్స్ తెలిపింది. అయితే, టీమిండియాతో అక్టోబరులో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. నిజానికి చాలాకాలంగా కమిన్స్ వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉంటున్నాడు.ఇంగ్లండ్‌తో నవంబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం కమిన్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా కాపాడుకుంటోంది. సారథి ఫిట్‌గా ఉంటేనే.. ఈ కీలక టెస్టు సిరీస్‌లో ఆసీస్ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగగలదు. సొంతగడ్డపై జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో తప్పక గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. యాషెస్ సిరీస్ ఆరంభం అపుడేకాగా చివరగా 2023లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆసీస్ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నవంబరు 21- జనవరి 8 వరకు యాషెస్ సిరీస్ జరుగనుంది.అంతకంటే ముందు.. న్యూజిలాండ్ పర్యటనను పూర్తి చేసుకుని ఆసీస్ స్వదేశానికి తిరిగి వచ్చి.. టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. అక్టోబరు 19- నవంబరు 8 మధ్య భారత్‌తో ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: వైభవ్? ఆయుశ్ మాత్రే?.. అతడే ముందుగా టీమిండియాలోకి వస్తాడు! -
AUS vs ENG: అతడికి ఇక నిద్రలేని రాత్రులే!.. వార్నర్ ఓ జోకర్!
ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) ఆరంభానికి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉంది. ఈసారి ఈ టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 21- 25 మధ్య తొలి టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, ఇప్పటి నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు మైండ్‌గేమ్ మొదలుపెట్టేశారు.ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ (Joe Root)ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) విమర్శలు చేశాడు. ఇంగ్లిష్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియా పిచ్‌ల మీద అతడు పెద్దగా బ్యాట్ ఝులిపించలేడు. గతంలో కూడా ఇలాగే జరిగింది.అతడికి ఇక నిద్రలేని రాత్రులే!నాకు బ్రాడీ బౌలింగ్‌లో ఎలాగైతే కాళరాత్రులు మిగిలాయో.. రూట్‌కు కూడా జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో నిద్రలేని రాత్రులే మిగులుతాయి. జో అద్భుతమైన క్రికెటర్. ప్రపంచంలోనే టెస్టుల్లో అత్యధిక పరుగులు రాబట్టిన రెండో ఆటగాడు.కానీ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడం అతడికి కాస్త కష్టమే. దానిని అతడు ఈసారి అధిగమిస్తాడనే అనుకుంటున్నా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని వార్నర్ పేర్కొన్నాడు.వార్నర్ ఓ జోకర్!వార్నర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. ‘‘అతడు వార్నర్. వార్నర్ అంటే ఓ జోకర్ లాంటివాడు. రూటీ మైండ్‌లో చోటు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. కానీ ఎన్నటికీ అది జరుగదు.అసలు రూట్‌తో సరదా ఫైట్‌కు కూడా వార్నర్ సరిపోడు. అతడు వార్నర్.. జస్ట్ వార్నర్ అంతే!.. అంతేనా? కాదా?’’ అంటూ మొయిన్ అలీ వార్నర్ పరువు తీశాడు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. యాషెస్ మొదలైన తర్వాత ఇంకెలా ఉంటుందో అంటూ ఇరుజట్ల అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ ఫామ్‌లో రూట్‌కాగా జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో మూడు శతకాలతో దుమ్ములేపాడు. ఐదు టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించిన రూట్.. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (754) తర్వాత రెండో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.భారత్‌తో సిరీస్ సందర్భంగానే జో రూట్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రిక్కీ పాంటింగ్‌ను అధిగమించి.. సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు రాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.ఇలాంటి వాళ్లు సరిపోరుఈ విషయం గురించి మొయిన్ అలీ ప్రస్తావిస్తూ.. ‘‘రూటీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. వార్నర్ లాంటి వాళ్ల మాటలు అతడిపై ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. అయినా.. రూట్ లాంటి వాళ్లను ప్రభావితం చేయాలంటే ఇలాంటి వాళ్లు సరిపోరు’’ అంటూ వార్నర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా నవంబరు 21- జనవరి 8 వరకు ఆసీస్- ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ జరుగనుంది. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీ ఇందుకు వేదికలు. చదవండి: నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్ కోహ్లి ఫొటో వైరల్