యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో హెడ్ సెంచరీతో సత్తాచాటాడు. తన హోమ్ గ్రౌండ్ అయిన అడిలైడ్ ఓవల్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో తన 11వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
హెడ్ 142 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌కు ఓపెనర్ వెథరాల్డ్ (1) ఔట్ కావడంతో ఆదిలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్ (13) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఈ సమయంలో హెడ్.. వెటరన్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా(40) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
అనంతరం ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా.. హెడ్ మాత్రం ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కంగారూ జట్టు ప్రస్తుతం 356 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రీజులో హెడ్‌తో పాటు అలెక్స్ కారీ(52) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హెడ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
హెడ్ సాధించిన రికార్డులు ఇవే..
👉అడిలైడ్ ఓవల్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజాలు డేవిడ్ వార్నర్, అలన్ బోర్డర్, డేవిడ్ బూన్ సరసన హెడ్ నిలిచాడు. ఈ మైదానంలో హెడ్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో హెడ్ కంటే ముందు మైఖేల్ క్లార్క్ (7), రికీ పాంటింగ్ (6) ఉన్నారు.
👉ఆస్ట్రేలియాలోని ఒకే వేదికలో వరుసగా నాలుగు టెస్టు సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్‌గా హెడ్ నిలిచాడు. అడిలైడ్‌లో హెడ్‌కు ఇది వరుసగా నాలుగో టెస్టు సెంచరీ. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మాన్, వాలీ హమ్మండ్, మైఖేల్ క్లార్క్, స్టీవ్ స్మిత్ వంటి లెజెండ్స్ ఉన్నారు.


