టీ20 ప్రపంచకప్-2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం(డిసెంబర్ 20) ప్రకటించనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సమావేశం కానున్నారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ జట్టును ప్రకటించనున్నాడు. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 7 నుంచి ఈ పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో టీమిండియా ఉంది. టీమిండియాతో పాటు పాకిస్తాన్, యూఎస్ఎ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ ఇంకా 6 టీ20 మ్యాచ్‌లు ఆడింది. సౌతాఫ్రికాతో ఒక్క మ్యాచ్.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ముగిశాక మెన్ ఇన్ బ్లూ నేరుగా టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 7న యూఏఈతో తలపడనుంది.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను చోప్రా ఎంపిక చేశాడు. అదేవిధంగా మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు అతడు చోటిచ్చాడు. వికెట్ కీపర్లగా సంజూ శాంసన్, జితేష్ శర్మలు ఉన్నారు.
ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేయగా.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఉన్నారు. అయితే చోప్రా ఎంపిక చేసిన జట్టులో స్టార్ ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా రింకూను ఎంపిక చేయలేదు.
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'


