ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.
హనీమూన్ వాయిదా?
అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్‌కు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్‌లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయినప్పటికి అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముంది. ఇదే విషయంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అతడు తప్పుబట్టాడు.
"మేము జోష్ ఇంగ్లిష్‌ను రిటైన్ చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియజేశాడు. తన పెళ్లి, హానీమూన్ కారణంగా కేవలం మూడు మ్యాచ్‌లకే మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పాడు.
అందుకే అతడిని వదులుకోవాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్‌లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లిష్‌ను రూ. 2.60 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.
చదవండి: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో


