IPL 2026: మినీ వేలంలో ఎవరికి ఎంత?.. పది జట్ల పూర్తి వివరాలు | IPL 2026 Full Squad List Of All Teams After Auction Sold Players Details | Sakshi
Sakshi News home page

IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు

Dec 17 2025 3:13 PM | Updated on Dec 17 2025 3:47 PM

IPL 2026 Full Squad List Of All Teams After Auction Sold Players Details

సన్‌రైజర్స్‌ జట్టు (PC: BCCI/IPL)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 సీజన్‌కు పది ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వేలానికి ముందు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. మంగళవారం నాటి వేలంపాటలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. 

అబుదాబి వేదికగా జరిగిన వేలంలో.. అత్యధిక పర్సు (రూ. 64.3 కోట్లు) కలిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది.

మరోవైపు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు కార్తీక్‌ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌(రూ. 14.20 కోట్లు)లపై కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కూడిన పది జట్ల వివరాలు మీకోసం..

ముంబై ఇండియన్స్‌ 
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
అల్లా ఘజన్‌ఫర్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ (లక్నో నుంచి ట్రేడింగ్‌), అశ్వనీ కుమార్‌, నమన్‌ ధీర్‌, షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (ట్రేడింగ్‌), కార్బిన్‌ బాష్‌, రఘు శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, రాజ్‌ అంగద్‌బవా, తిలక్‌ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్‌ మింజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, రోహిత్‌ శర్మ, విల్‌ జాక్స్‌, మయాంక్‌ మార్కండే (ట్రేడింగ్‌), రియాన్‌ రికెల్టన్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
క్వింటన్‌ డి కాక్‌ (రూ.1 కోటి), మయాంక్‌ రావత్‌ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్‌ (రూ. 30 లక్షలు), మొహమ్మద్‌ ఇజ్‌హార్‌ (రూ. 30 లక్షలు), డానిశ్‌ మాలేవర్‌ (రూ. 30 లక్షలు). 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్‌, ఎంఎస్‌ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్‌), శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్‌ చౌదరి.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కార్తీక్‌ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్‌ వీర్‌ (రూ.14.20 కోట్లు), రాహుల్‌ చహర్‌ (రూ.5.20 కోట్లు), మాట్‌ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్‌ హొసీన్‌ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్‌ (రూ.1.50 కోట్లు), జాక్‌ ఫూల్క్స్‌ (రూ.75 లక్షలు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.75 లక్షలు), అమన్‌ ఖాన్‌ (రూ.40 లక్షలు). 

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
అజింక్య రహానే, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువన్షి, సునిల్‌ నరైన్‌, అనుకుల్‌ రాయ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, మనీశ్‌ పాండే, వరుణ్‌ చక్రవర్తి, రమణ్‌దీప్‌ సింగ్‌, రింకూ సింగ్‌

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కామెరాన్‌ గ్రీన్‌ (రూ. 25.20 కోట్లు), మతీశ పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్‌ రెహ్మాన్‌ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్‌ (రూ.3 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్‌ అలెన్‌ (రూ.2 కోట్లు), సీఫెర్ట్‌ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్‌ (రూ.1 కోటి), రాహుల్‌ త్రిపాఠి (రూ. 75 లక్షలు), కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్‌ రంజన్‌ (రూ.30 లక్షలు), ప్రశాంత్‌ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్‌ త్యాగి (రూ.30 లక్షలు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
ప్యాట్‌ కమిన్స్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్‌, హర్షల్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌, అనికేత్‌ వర్మ, జీషన్‌ అన్సారీ, హర్ష్‌ దూబే, కమిందు మెండిస్‌, ఇషాన్‌ మలింగ, బ్రైడన్‌​ కార్స్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
లివింగ్‌స్టోన్‌ (రూ.13 కోట్లు), జేక్‌ ఎడ్వర్డ్స్‌ (రూ.3 కోట్లు), సలీల్‌ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్‌ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్‌ (రూ. 30 లక్షలు), అమిత్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు), ఓంకార్‌ (రూ. 30 లక్షలు), సాకిబ్‌ హుస్సేన్‌ (రూ. 30 లక్షలు), శివాంగ్‌ కుమార్‌ (రూ. 30 లక్షలు).

గుజరాత్‌ టైటాన్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), షారుఖ్‌ ఖాన్‌, కుమార్‌ కుశాగ్రా (వికెట్‌ కీపర్‌), అనూజ్‌ రావత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రషీద్‌ ఖాన్‌, రాహుల్‌ తెవాటియా, నిషాంత్‌ సింధు, గ్లెన్‌ ఫిలిప్స్‌, అర్షద్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి కిశోర్‌, కగిసో రబడ, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
జేసన్‌ హోల్డర్‌ (రూ.7 కోట్లు), బాంటన్‌ (రూ. 2 కోట్లు), అశోక్‌ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్‌వుడ్‌ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్‌ (రూ. 30 లక్షలు). 

రాజస్తాన్‌ రాయల్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
ధ్రువ్‌ జురెల్‌, రియాన్ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌, డొనొవాన్‌ ఫెరీరా (ట్రేడింగ్‌), సామ్‌ కర్రాన్‌ (ట్రేడింగ్‌), యుధ్‌వీర్‌ చరక్‌, జోఫ్రా ఆర్చర్‌, సందీప్‌ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, లువాన్‌ డ్రి ప్రిటోరియస్‌, శుభమ్‌ దూబే, నండ్రీ బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్‌), వైభవ్‌ సూర్యవంశీ.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
రవి బిష్ణోయ్‌ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్‌ (రూ.95 లక్షలు), సుశాంత్‌ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్‌ సేన్‌ (రూ.75 లక్షలు), బ్రిజేశ్‌ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్‌రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్‌ (రూ. 30 లక్షలు), యశ్‌రాజ్‌ (రూ. 30 లక్షలు). 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
అభినందన్‌ సింగ్‌, నువాన్‌ తుషార, టిమ్‌ డేవిడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫిల్‌ సాల్ట్‌, విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రజత్‌ పాటిదార్‌, యశ్‌ దయాళ్‌, జేకబ్‌ బెతెల్‌, రసిఖ్‌ ధార్‌, జితేశ్‌ శర్మ, రొమారియో షెఫర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, సూయాంశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, స్వప్నిల్‌ సింగ్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 7 కోట్లు), మంగేశ్‌ యాదవ్‌ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్‌ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్‌ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్‌ (రూ. 30 లక్షలు). 

ఢిల్లీ క్యాపిటల్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
అభిషేక్‌ పోరెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, త్రిపురాణ విజయ్‌, అజయ్‌ మండల్‌, మాధవ్‌ తివారి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, అశుతోశ్‌ శర్మ, మిచెల్‌ స్టార్క్‌, విప్రజ్‌ నిగమ్‌, అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌, దుష్మంత చమీర, నితీశ్‌ రాణా (రాజస్తాన్‌ నుంచి ట్రేడింగ్‌), కరుణ్‌ నాయర్‌, సమీర్‌ రిజ్వి, కేఎల్‌ రాహుల్‌, టి.నటరాజన్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఆఖిబ్‌ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్‌ (రూ.2 కోట్లు), ఎన్‌గిడి (రూ.2 కోట్లు), డకెట్‌ (రూ. 2 కోట్లు), మిల్లర్‌ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్‌ పరాఖ్‌ (రూ.30 లక్షలు)

లక్నో సూపర్‌ జెయింట్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
అబ్దుల్‌ సమద్‌, దిగ్వేశ్‌ రాఠీ, మొహ్సిన్‌ ఖాన్‌, ఐడెన్‌ మార్క్రమ్‌, హిమ్మత్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌. ఆకాశ్‌ సింగ్‌, మణిమరన్‌ సిద్దార్థ్‌, ప్రిన్స్‌ యాదవ్‌. అర్జున్‌ టెండుల్కర్‌ (ముంబై నుంచి ట్రేడింగ్‌), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్‌ పంత్‌, అర్షిన్‌ కులకర్ణి, మయాంక్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, మొహమమ్మద్‌ షమీ (సన్‌రైజర్స్‌ నుంచి ట్రేడింగ్‌), ఆయుశ్‌ బదోని, మిచెల్‌ మార్ష్‌

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఇన్‌గ్లిస్‌ (రూ.8.60 కోట్లు), ముకుల్‌ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్‌ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్‌ తివారి (రూ.1 కోటి). 

పంజాబ్‌ కింగ్స్‌ 
అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు
అర్ష్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ ఓవెన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, ముషీర్‌ ఖాన్‌. సూర్యాంశ్‌ షెడ్గే, హర్నూర్‌ పన్నూ, నేహాల్‌ వధేరా, విష్ణు వినోద్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, వైశాక్‌ విజయ్‌కుమార్‌, లాకీ ఫెర్గూసన్‌, ప్రియాంశ్‌ ఆర్య, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కో యాన్సెన్‌, పైలా అవినాశ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టొయినిస్‌, శశాంక్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
బెన్‌ డ్వార్‌షుయిస్‌ (రూ.4.40 కోట్లు), కూపర్‌ కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్‌ (రూ. 30 లక్షలు), ప్రవీణ్‌ దూబే (రూ. 30 లక్షలు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement