Kartik Sharma
-
సీఎస్కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్కే శనివారం రెండో అంచె పోటీలోనూ మరోసారి ముంబైని ఓడించింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.160 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కార్తిక్ శర్మ (54 నాటౌట్) అజేయంగా నిలిచి సీఎస్కేను గెలిపించారు. ముంబై బౌలర్లలో బుమ్రా, గజన్ఫర్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.అజేయ అర్థసెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.An unorthodox finishing touch to a classic rivalry! 🎬🎥 @ChennaiIPL complete the double over their arch-rivals #MI in style 💛Scorecard ▶️ https://t.co/VVAjldiiC0#TATAIPL | #KhelBindaas | #CSKvMI | @ChennaiIPL pic.twitter.com/yeBWsXZ6Lu— IndianPremierLeague (@IPL) May 2, 2026 -
బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడే.. చెన్నైకి ఎవరున్నారు?
చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన ఆటగాళ్లను ఎంచుకోవడంలో సీఎస్కే విఫలమైందని విమర్శించాడు. గతేడాది నుంచి సీఎస్కే వైఫల్యాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్-2025 సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది చెన్నై. తమ చరిత్రలో ఇంతటి ఘోర పరాభవం పొందడం ఇదే తొలిసారి. ఇక తాజాగా ఐపీఎల్-2026లో ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది. ఒక్కొక్కరికి రూ. 14 కోట్లా?ఇదిలా ఉంటే.. మినీ వేలంలో భాగంగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలకు ఒక్కొక్కరికి రూ. 14 కోట్లకు పైగా చొప్పున సీఎస్కే ఖర్చు చేసింది. వీరి ప్రదర్శన మాత్రం ధరకు తగ్గట్లుగా లేదు. వీరిద్దరు ఇప్పటికే అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ కోసం ఆటగాళ్లను వెదికేందుకు హేమంగ్ బదానీ, వేణుగోపాల్ రావు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో ప్రతి మ్యాచ్ చూస్తూ ఆటగాళ్లను వెలికి తీస్తారు.సీఎస్కే కోసం ఈ పని చేసేందుకు ఎవరున్నారు? ఎవరో ఇచ్చిన సలహాలను పాటించి ఒక్కొక్కరికి రూ. 14 కోట్ల చొప్పున ఇద్దరు ఆటగాళ్ల కోసం డబ్బంతా ధారపోశారు. ప్రతిభావంతులైన ఆటగాళ్ల కోసం సీఎస్కే అసలు ప్రయత్నిస్తోందా?’’ అని చెన్నై మేనేజ్మెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.బుమ్రా, హార్దిక్‌లను గుర్తించింది అతడేఈ సందర్భంగా టీమిండియా స్టార్, దిగ్గజ పేస్ బౌలర్‌గా ఎదిగిన జస్ప్రీత్ బుమ్రా గురించి సుబ్రమణ్యం బద్రీనాథ్ ప్రస్తావించాడు. ‘‘అన్ని జట్లకు మంచి స్కౌట్లు ఉన్నారు. ముంబై ఇండియన్స్‌కు మహేళ జయవర్దనే, రిక్కీ పాంటింగ్ కోచ్‌లుగా ఉన్నా.. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాల ప్రతిభను గుర్తించింది మాత్రం జాన్ రైట్. ఇలాంటి విషయాల్లో సీఎస్‌కు చాలా వెనుకబడి ఉంది. స్కౌటింగ్ విషయంలో వాళ్లకు అసలు సరైన విధానమే లేదు’’ అని సుబ్రమణ్యం బద్రీనాథ్ విమర్శించాడు.చదవండి: చారిత్రక ద్వైపాక్షిక సిరీస్‌ను ప్రకటించిన పాకిస్తాన్ -
IPL 2026: కుర్ర క్రికెటర్లపైనే అందరి దృష్టి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చింది. ఇవాళ టీమిండియా స్టార్లుగా చెలామణి అవుతున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ సహా ఎందరో క్రికెటర్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఐపీఎల్లే అనడంలో సందేహం లేదు. 2008 నుంచి 18 సీజన్ల పాటు నిరంతరాయంగా సాగుతూ వస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. గత సీజన్లో బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి వచ్చి చేరింది. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులెవరన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.జూనియర్ మిల్లర్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ మిల్లర్ తరహా బ్యాటింగ్ శైలిని పోలి ఉండే 20 ఏళ్ల అమేథీ కుర్రాడు ప్రశాంత్ వీర్‌పై ఈ సీజన్లో భారీ అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా ఆశించినంతంగా ఫలితాలు రాకపోవడంతో జట్టులో యువ ఆటగాళ్లను నింపేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే వేలంలో ప్రశాంత్ వీర్‌ను ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకోవడం ఆశ్చర్యపరిచింది. దేశవాలీ క్రికెట్లో సంచలన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన ప్రశాంత్ వీర్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. ఆ టోర్నీలో 320 పరుగులు చేయడంతో 8 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్ కావడంతో జడ్డూ స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే భారీ ఆశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్ అంచనాలను అందుకుంటాడా అన్నది చూడాలి.సిక్సర్లకు పెట్టింది పేరు..చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడనున్న మరో విధ్వంసక వీరుడు కార్తిక్ శర్మ. రాజస్థాన్‌కు చెందిన కార్తిక్ శర్మ అవలీలగా సిక్సర్లు కొట్టగలడు. అందుకే వేలంలో సీఎస్కే ఇతడిని రూ. 14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో కార్తిక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు.ఇక వేలంలో కార్తిక్ శర్మ కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటేనే మనోడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ చెన్నై జట్టుకు కీలక బ్యాటర్‌గా మారే అవకాశముంది.ఢిల్లీ ఆశాకిరణం..ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్లో బాగా వినిపిస్తున్న పేరు అకిబ్ నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది.ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇటీవలే పేర్కొన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆకిబ్ నబీ టైటిల్ అందిస్తాడేమో చూడాలి. ఒకవేళ నబీ ఆ ఫీట్‌ను సాధిస్తే మాత్రం టీమిండియాలోకి పిలుపు రావడం లాంఛనమే అవుతుంది.ఆ కొరత తీరినట్లే!భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి అదరగొడుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికేసినట్లే.దంచుడే లక్ష్యంగా..ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వీ దహియా కూడా విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు బరిలోకి దిగిందే తడవు దంచుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం అతడి నైజం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ గత ఎడిషన్‌లో తేజస్వీ దహియా 10 ఇన్నింగ్స్‌ల్లో 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. కీపర్‌గాను అద రగొడుతున్నాడు. వీళ్లే కాదు ఇంకా చాలా మంది యువ క్రికెటర్లు ఈసారి ఐపీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.చదవండి: ధోనికి గాయం.. ఐపీఎల్‌కు దూరం! -
నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు.. ఇప్పుడిలా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. క్యాష్ రిచ్ లీగ్‌లోని ఫ్రాంఛైజీలు తమ జట్లను పటిష్ట పరచుకునే క్రమంలో మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసి.. ఒక రకంగా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాయి. ఐపీఎల్-2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.రూ. 14.20 కోట్లుఅన్క్యాప్డ్ ఆటగాళ్లు అయిన కార్తిక్ శర్మ (Kartik Sharma), ప్రశాంత్ వీర్ (Prashant Veer)లపై చెరో రూ. 14.20 కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్‌లో వీరిద్దరు నయా సెన్సేషన్లుగా నిలిచారు. ఇద్దరిదీ మధ్య తరగతి కుటుంబమే. తల్లిదండ్రుల త్యాగాలతోనే ఆటగాళ్లుగా ఎదిగిన కార్తిక్, ప్రశాంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా చరిత్ర సృష్టించారు.వీరిద్దరిలో కార్తిక్ శర్మ కుటుంబం ఒకానొక దశలో దయనీయ పరిస్థితులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని అతడి కుటుంబమే స్వయంగా IANSకు తెలిపింది. పందొమ్మిదేళ్ల కార్తిక్ స్వస్థలం రాజస్తాన్‌లోని భరత్పూర్. అతడి తల్లిదండ్రులు మనోజ్ శర్మ, రాధ. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం.అయితే, కుమారుడిని క్రికెటర్ చేయాలన్నది కార్తిక్ తల్లిదండ్రుల కల. ముఖ్యంగా అతడి తల్లి రాధ కొడుకు ఏదో ఒకరోజు కచ్చితంగా ఆటగాడిగా ఎదుగుతాడని బలంగా నమ్మేవారు. అందుకోసం భర్తతో కలిసి ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఈ విషయం గురించి కార్తిక్ తండ్రి మనోజ్ శర్మ మాటల్లోనే..నగలు, ప్లాట్లు, పొలం అమ్మేశారు‘‘మా ఆదాయం అంతంతమాత్రమే. అయితే, నా భార్య రాధకు మాత్రం ఓ కల ఉండేది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కార్తిక్‌ను క్రికెటర్ చేయాలని ఆమె అంటూ ఉండేది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. మా కుమారుడు క్రికెటర్ అయితే చాలు అనుకునేది.కార్తిక్ శిక్షణ కోసం మేము మాకున్న చిన్నపాటి ప్లాట్లు, బరేనా గ్రామంలో మాకున్న పొలం అమ్మేశాము. రాధ తన నగలు కూడా అమ్మేసింది. మా జీవితాల్లో అదొక అత్యంత కఠినమైన దశ. అయితే, ఆర్థిక ఇబ్బందుల ప్రభావం కార్తిక్‌పై పడకుండా మేము చూసుకున్నాము.గ్వాలియర్‌లో టోర్నమెంట్ ఆడేందుకు కార్తిక్‌ను నేను అక్కడికి తీసుకువెళ్లాను. నాలుగైదు మ్యాచ్‌లలోనే జట్టు ఇంటిబాట పడుతుందని అనుకున్నాము. అయితే, కార్తిక్ ప్రదర్శన కారణంగా జట్టు ఫైనల్ చేరింది. అయితే, ఆ మ్యాచ్ అయ్యేంత వరకు గ్వాలియర్లోనే ఉండేందుకు మా దగ్గర సరిపడా డబ్బు లేదు.ఖాళీ కడుపుతోనేఅప్పుడు మేము ఓ నైట్ షెల్టర్‌లో ఉన్నాము. తినడానికి ఏమీ లేదు. ఖాళీ కడుపుతోనే ఆరోజు నిద్రపోయాము. తర్వాత ఫైనల్లో మ్యాచ్ గెలిచిన తర్వాత కార్తిక్‌కు వచ్చిన ప్రైజ్‌మనీతోనే మేము తిరిగి ఇంటికి చేరుకోగలిగాము’’ అని తాము పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు.అదే విధంగా.. ‘‘రెండున్నరేళ్ల వయసులోనే నా కుమారుడు బ్యాట్‌తో బంతిని బాది రెండు ఫొటోఫ్రేములను పగులగొట్టాడు. అది మాకెంతో ప్రత్యేకం. ఆరోజే మేము తన భవిష్యత్తు గురించి ఓ అంచనాకు వచ్చేశాము. నిజానికి క్రికెటర్ కావాలని నేనూ కలగన్నాను. అయితే, నా కోరిక తీరలేదు. నా కుమారుడి రూపంలో ఇప్పుడు ఆ కల నెరవేరింది’’ అని మనోజ్ శర్మ తెలిపారు.చదువునూ కొనసాగిస్తాకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ కోసం వేలంలో గట్టి పోటీ ఎదురైనా చెన్నై మాత్రం అతడిని వదల్లేదు. భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన కార్తిక్.. క్రికెట్‌తో పాటు చదువునూ కొనసాగిస్తానని చెబుతున్నాడు. ఇక కార్తిక్ పెద్ద తమ్ముడు చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టగా.. చిన్న తమ్ముడు మాత్రం క్రికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.సంకల్పం బలంగా ఉంటే.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరవచ్చని ఇప్పటికే ఎంతో మంది యువ క్రీడాకారులు నిరూపించారు. ఇప్పుడీ జాబితాలో కార్తిక్ శర్మ కూడా చేరాడు. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా.. టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసే ఐపీఎల్‌కు అతడు సెలక్ట్ అయ్యాడు. చెన్నై వంటి చాంపియన్ జట్టు అతడిని ఏరికోరి కొనుక్కోవడం అతడి ప్రతిభకు నిదర్శనం.చదవండి: IND vs SA: 'ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో ఆడాను.. అంపైర్ల నిర్ణయంతో షాకయ్యాను' -
ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’.. ఇప్పుడు కుర్రాళ్లకు కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై ఈసారి మినీ వేలంలో ఓ రకంగా ప్రకంపనలు సృష్టించింది. సాధారణంగా అనుభవానికి పెద్దపీట వేసే సీఎస్కే ... ఈసారి మాత్రం భవిష్యత్తుపై భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టింది.ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా... అన్క్యాప్డ్ ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టింది. ఒకప్పుడు ‘డాడీస్ ఆర్మీ’గా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ (Prashant Veer), కార్తీక్ శర్మను రూ. 14.20 కోట్ల చొప్పున వెచ్చించి కొనుగోలు చేసుకుంది.రంజీ ట్రోఫీ, ముస్తాక్ అలీ టోర్నీ, భారత్ ‘ఎ’, అండర్–19, అండర్–23 ఇలా ఏ స్థాయిలోనూ పెద్దగా ఆకట్టుకోకపోయినా... కేవలం నైపుణ్యాన్ని నమ్మి యువ ఆటగాళ్ల కోసం భారీగా వెచ్చిచండం విశేషం. ప్రతిభకు పెద్ద పీట వేసే చెన్నై జట్టు ఇంత భారీ ఖర్చు పెట్టడంతో... కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వీరిద్దరి నేపథ్యాలను పరిశీలిస్తే...ధోనీకి ప్రత్యామ్నాయమా! ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి... ఏవో కొన్ని మ్యాచ్‌లు తప్ప... దాదాపు అన్నీ సమయాల్లో మహేంద్ర సింగ్ ధోనినే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్‌గా దర్శనమిచ్చాడు. అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో ఆఖర్లో వస్తున్న ధోని... ఇంకెంతో కాలం ఐపీఎల్లో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వికెట్ల వెనక సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతో పాటు... లోయర్ ఆర్డర్లో ధాటిగా షాట్లు ఆడగల ప్లేయర్‌ను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో చెన్నై ఫ్రాంచైజీ వేలంలో అడుగు పెట్టింది.అంతకుముందే టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్(Sanju Samson)ను ట్రేడింగ్‌లో తీసుకున్నా... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ కోసం కోట్లు కుమ్మరించింది. జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు... ఐపీఎల్ వేలానికి ముందే ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజాను వదిలేసుకున్న చెన్నై జట్టు అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్‌ను ఎంపిక చేసుకుంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన ప్రశాంత్... లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సమర్థుడు. ఉత్తర ప్రదేశ్ లీగ్‌లో మంచి ప్రదర్శనలు కనబర్చిన ప్రశాంత్... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 మ్యాచ్‌లాడి 2 వికెట్లు తీశాడు. ఇక టి20ల్లో 9 మ్యాచ్‌లాడి 160కి పైగా స్ట్రయిక్ రేట్‌తో 112 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టాడు. ప్రాధమిక ధర రూ. 30 లక్షలతో వేలంలో అడుగపెట్టిన ప్రశాంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ. 14.20 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: IPL 2026: కనక వర్షం.. ‘మినీ’ వేలంలో ఎవరికి ఎంత? పది జట్ల వివరాలు -
IPL 2026: మినీ వేలంలో ఎవరికి ఎంత?.. పది జట్ల పూర్తి వివరాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 సీజన్‌కు పది ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. వేలానికి ముందు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. మంగళవారం నాటి వేలంపాటలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అబుదాబి వేదికగా జరిగిన వేలంలో.. అత్యధిక పర్సు (రూ. 64.3 కోట్లు) కలిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చు చేసింది.మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ అన్క్యాప్డ్ ఆటగాళ్లు కార్తీక్ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్ వీర్(రూ. 14.20 కోట్లు)లపై కనక వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న, కొనుగోలు చేసిన ఆటగాళ్లతో కూడిన పది జట్ల వివరాలు మీకోసం..ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లుఅల్లా ఘజన్ఫర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ (లక్నో నుంచి ట్రేడింగ్), అశ్వనీ కుమార్, నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (ట్రేడింగ్), కార్బిన్ బాష్, రఘు శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చహర్, రాజ్ అంగద్‌బవా, తిలక్ వర్మ, హార్దిక్‌పాండ్యా, రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, విల్ జాక్స్, మయాంక్ మార్కండే (ట్రేడింగ్), రియాన్ రికెల్టన్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుక్వింటన్ డి కాక్ (రూ.1 కోటి), మయాంక్ రావత్ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (రూ. 30 లక్షలు), మొహమ్మద్ ఇజ్హార్ (రూ. 30 లక్షలు), డానిశ్ మాలేవర్ (రూ. 30 లక్షలు). చెన్నై సూపర్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లురుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (RR నుంచి ట్రేడింగ్), శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జన్‌ప్రీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, శ్రేయాష్ గోపాల్, ముకేశ్ చౌదరి.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకార్తీక్ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), రాహుల్ చహర్ (రూ.5.20 కోట్లు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), అకీల్ హొసీన్ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.50 కోట్లు), జాక్ ఫూల్క్స్ (రూ.75 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), అమన్ ఖాన్ (రూ.40 లక్షలు). కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅజింక్య రహానే, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువన్షి, సునిల్ నరైన్, అనుకుల్ రాయ్, ఉమ్రాన్ మాలిక్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, మనీశ్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుకామెరాన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), మతీశ పతిరణ (రూ.18 కోట్లు), ముస్తఫిజుర్ రెహ్మాన్ (రూ.9.20 కోట్లు), తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఫిన్ అలెన్ (రూ.2 కోట్లు), సీఫెర్ట్ (రూ.1.50 కోట్లు), ఆకాశ్‌దీప్ (రూ.1 కోటి), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), కామ్రా (రూ.30 లక్షలు), సార్థక్ రంజన్ (రూ.30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.30 లక్షలు)సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లులివింగ్స్టోన్ (రూ.13 కోట్లు), జేక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.50 కోట్లు), శివమ్ మావి (రూ.75 లక్షలు), ఫులెట్రా (రూ. 30 లక్షలు), ప్రఫుల్ (రూ. 30 లక్షలు), అమిత్ కుమార్ (రూ. 30 లక్షలు), ఓంకార్ (రూ. 30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ. 30 లక్షలు), శివాంగ్ కుమార్ (రూ. 30 లక్షలు).గుజరాత్ టైటాన్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుశుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), అనూజ్ రావత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, నిషాంత్ సింధు, గ్లెన్ ఫిలిప్స్, అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సాయి కిశోర్, కగిసో రబడ, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుజేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు), బాంటన్ (రూ. 2 కోట్లు), అశోక్ శర్మ (రూ.90 లక్షలు), ల్యూక్‌వుడ్ (రూ.75 లక్షలు), పృథ్వీరాజ్ (రూ. 30 లక్షలు). రాజస్తాన్ రాయల్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, డొనొవాన్ ఫెరీరా (ట్రేడింగ్), సామ్ కర్రాన్ (ట్రేడింగ్), యుధ్వీర్ చరక్, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, క్వెనా మఫాక, షిమ్రన్ హెట్మెయిర్, లువాన్ డ్రి ప్రిటోరియస్, శుభమ్ దూబే, నండ్రీ బర్గర్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా (ట్రేడింగ్), వైభవ్ సూర్యవంశీ.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లురవి బిష్ణోయ్ (రూ.7.20 కోట్లు), మిల్నే (రూ.2.40 కోట్లు), రవి సింగ్ (రూ.95 లక్షలు), సుశాంత్ మిశ్రా (రూ.90 లక్షలు), కుల్దీప్ సేన్ (రూ.75 లక్షలు), బ్రిజేశ్ శర్మ (రూ. 30 లక్షలు), పేరాల అమన్‌రావు (రూ. 30 లక్షలు), విఘ్నేశ్ (రూ. 30 లక్షలు), యశ్‌రాజ్ (రూ. 30 లక్షలు). రాయల్ చాలెంజర్స్ బెంగళూరుఅట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభినందన్ సింగ్, నువాన్ తుషార, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటిదార్, యశ్ దయాళ్, జేకబ్ బెతెల్, రసిఖ్ ధార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, జోష్ హాజిల్‌వుడ్, సూయాంశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లువెంకటేశ్ అయ్యర్ (రూ. 7 కోట్లు), మంగేశ్ యాదవ్ (రూ.5.20 కోట్లు), డఫీ (రూ.2 కోట్లు), కాక్స్ (రూ.75 లక్షలు), కనిష్క్ (రూ. 30 లక్షలు), విహాన్ (రూ. 30 లక్షలు), విక్కీ (రూ. 30 లక్షలు), సాత్విక్ (రూ. 30 లక్షలు). ఢిల్లీ క్యాపిటల్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, మిచెల్ స్టార్క్, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, దుష్మంత చమీర, నితీశ్ రాణా (రాజస్తాన్ నుంచి ట్రేడింగ్), కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, కేఎల్ రాహుల్, టి.నటరాజన్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఆఖిబ్ నబీ (రూ.8.40 కోట్లు), నిసాంక (రూ.4 కోట్లు), జేమీసన్ (రూ.2 కోట్లు), ఎన్గిడి (రూ.2 కోట్లు), డకెట్ (రూ. 2 కోట్లు), మిల్లర్ (రూ. 2 కోట్లు), పృథ్వీ షా (రూ. 75 లక్షలు), సాహిల్ పరాఖ్ (రూ.30 లక్షలు)లక్నో సూపర్ జెయింట్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅబ్దుల్ సమద్, దిగ్వేశ్ రాఠీ, మొహ్సిన్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్, హిమ్మత్ సింగ్, నికోలస్ పూరన్. ఆకాశ్ సింగ్, మణిమరన్ సిద్దార్థ్, ప్రిన్స్ యాదవ్. అర్జున్ టెండుల్కర్ (ముంబై నుంచి ట్రేడింగ్), మాథ్యూ బ్రిట్జ్జ్కే, రిషభ్ పంత్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మొహమమ్మద్ షమీ (సన్‌రైజర్స్ నుంచి ట్రేడింగ్), ఆయుశ్ బదోని, మిచెల్ మార్ష్వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుఇన్గ్లిస్ (రూ.8.60 కోట్లు), ముకుల్ చౌధరీ (రూ.2.60 కోట్లు), అక్షత్ రఘువంశీ (రూ.2.20 కోట్లు), నోర్జే (రూ. 2 కోట్లు), హసరంగ (రూ. 2 కోట్లు), నమన్ తివారి (రూ.1 కోటి). పంజాబ్ కింగ్స్ అట్టి పెట్టుకున్న ఆటగాళ్లుఅర్ష్దీప్ సింగ్, మిచెల్ ఓవెన్, శ్రేయస్ అయ్యర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముషీర్ ఖాన్. సూర్యాంశ్ షెడ్గే, హర్నూర్ పన్నూ, నేహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైశాక్ విజయ్‌కుమార్, లాకీ ఫెర్గూసన్, ప్రియాంశ్ ఆర్య, జేవియర్ బార్ట్లెట్, మార్కో యాన్సెన్, పైలా అవినాశ్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టొయినిస్, శశాంక్ సింగ్, యజువేంద్ర చహల్.వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లుబెన్ డ్వార్షుయిస్ (రూ.4.40 కోట్లు), కూపర్ కనోలీ (రూ.3 కోట్లు), నిషాద్ (రూ. 30 లక్షలు), ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు).


