సీఎస్‌కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి | IPL 2026: Chennai Super Kings Beat Mumbai Indians By 8 Wickets | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేను గెలిపించిన కార్తిక్ శర్మ.. ముంబై ఓటమి

May 2 2026 11:21 PM | Updated on May 3 2026 8:49 AM

IPL 2026: Chennai Super Kings Beat Mumbai Indians By 8 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై సీఎస్‌కే ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. తొలి అంచె పోటీల్లో ముంబైని చిత్తుగా ఓడించిన సీఎస్‌కే శ‌నివారం రెండో అంచె పోటీలోనూ మ‌రోసారి ముంబైని ఓడించింది. శ‌నివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

160 ప‌రుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే మరో 11 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (67 నాటౌట్‌), ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వచ్చిన కార్తిక్‌ శ‌ర్మ (54 నాటౌట్‌) అజేయంగా నిలిచి సీఎస్‌కేను గెలిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా, గ‌జ‌న్‌ఫ‌ర్ చెరొక వికెట్ తీశారు. 

అంత‌క‌ముందు ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. నమన్ ధిర్ (57 పరుగులు) అర్థసెంచరీతో రాణించాడు. రియాన్ రికెల్‌టన్ (37), సూర్యకుమార్ (21) పర్వాలేదనిపించారు.  సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అజేయ అర్థ‌సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఇది నాలుగో విజ‌యం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓట‌మి. దీంతో ముంబై ప్లేఆఫ్ అవ‌కాశాలు మ‌రింత క్లిష్టం చేసుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో సీఎస్‌కే 8 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉండ‌గా.. ముంబై ఇండియ‌న్స్ 4 పాయింట్ల‌తో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement