breaking news
IPL 2026 auction
-
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సూపర్ లీగ్ మ్యాచ్‌లో ముంబై అదరగొట్టింది. హర్యానా విధించిన 235 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దేశీ టీ20 టోర్నమెంట్ సూపర్ లీగ్‌లోని గ్రూప్-బిలో భాగంగా పుణెలోని డీవై పాటిల్ అకాడమీలో ముంబై- హర్యానా జట్లు ఆదివారం తలపడ్డాయి. 234 పరుగులుటాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. హర్యానా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 234 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్లలో కెప్టెన్ అంకిత్ కుమార్ (42 బంతుల్లో 89) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటగా.. వన్‌డౌన్ బ్యాటర్ నిశాంత్ సంధు (38 బంతుల్లో 63 నాటౌట్) ధనాధన్ దంచికొట్టాడు. మిగిలిన వారిలో సమంత్ జేఖర్ (14 బంతుల్లో 31 రిటైర్డ్ అవుట్), సుమిత్ కుమార్ (4 బంతుల్లో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు.శతక్కొట్టిన జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్‌ఇక హర్యానాకు ధీటుగా బదులిచ్చే క్రమంలో ముంబై ఓపెనర్, టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతక్కొట్టాడు. కేవలం యాభై బంతుల్లోనే ఏకంగా 16 ఫోర్లు, ఒక సిక్స్‌బాది 101 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే (10 బంతులల్లో 21) ఫర్వాలేదనిపించగా.. మూడో స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (Sarfraz Khan) అదరగొట్టాడు.కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన సర్ఫరాజ్.. మొత్తంగా 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2026 వేలానికి ముందు ఈ మేరకు సత్తా చాటి.. తానూ రేసులోనే ఉన్నానంటూ ఫ్రాంఛైజీలకు మరోసారి సందేశం ఇచ్చాడు.17.3 ఓవర్లలోనే ఇక మిగిలిన ముంబై ఆటగాళ్లలో అంగ్క్రిష్ రఘువన్షీ (7), సూయాంశ్ షెడ్గే (13), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (2) విఫలం కాగా.. సాయిరాజ్ పాటిల్ (3 బంతుల్లో 8), అథర్వ అంకోలేకర్ (2 బంతుల్లో 10) మెరుపులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. జైసూ, సర్ఫరాజ్ దంచికొట్టగా.. వీరిద్దరు ఆఖర్లో వేగంగా ఆడటంతో 17.3 ఓవర్లలోనే హర్యానా విధించిన లక్ష్యాన్ని ముంబై ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. వైభవ్ సూర్యవంశీ అట్టర్‌ఫ్లాప్ -
IPL 2026: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ బౌలర్ల మీదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 వేలంలో దేశీ ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా, రవి బిష్ణోయి, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. పాటు విదేశీ ప్లేయర్లు కామెరాన్ గ్రీన్, క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్ వంటి వారు హైలైట్ కానున్నారు. స్టార్లను మినహాయించితే ఈ ఐదుగురు భారత అన్క్యాప్డ్ బౌలర్లు కూడా ఈసారి వేలంలో మంచి ధర పలికే అవకాశం ఉంది.ఆకిబ్ నబీజమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ. అనుభవం, నైపుణ్యాలు కలిగిన ఈ ఫాస్ట్‌బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపడం ఖాయం. తాజా దేశీ సీజన్లలో అతడు అద్భుత ప్రదర్శన కనబరచడం ఇందుకు కారణం. 2025-26 రంజీ సీజన్లో అదరగొట్టిన ఈ రైటార్మ్ పేసర్.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ దుమ్ములేపాడు.ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు 15 వికెట్లు కూల్చిన ఆకిబ్.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. వేలానికి ముందు అతడి ఈ అత్యుత్తమ ప్రదర్శన ఫ్రాంఛైజీలను ఊరిస్తోంది.ఈడెన్ ఆపిల్ టామ్కేరళకు చెందిన తాజా బౌలింగ్ సంచలనం ఈడెన్ ఆపిల్ టామ్. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటికి ఆడిన ఏడు మ్యాచ్‌లలో రెండుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు 20 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్. తాజా రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌పై (4/55 & 2/33) ఉత్తమ గణాంఖాలు నమోదు చేశాడు.ఇక మొత్తంగా ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 19 వికెట్లు కూల్చాడు ఆపిల్. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడికి అనుభవం లేదు. అయినప్పటికీ అతడి నైపుణ్యాల కారణంగా కనీస ధర రూ. 20లక్షలకైనా అమ్ముడుపోయే అవకాశం ఉంది.రాజ్ లింబానిఅండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టులో రాజ్ లింబాని సభ్యుడు. 2024లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం పేసర్.. ఇప్పటికి 11 మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చాడు. కొత్త బంతితో అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు అదరగొట్టాడు. డెత్ ఓవర్లలోనూ తనదైన శైలిలో రాణించాడు.ఆకాశ్ మధ్వాల్2023లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు ఆకాశ్ మధ్వాల్. ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటాడు. ఆ తర్వాత రాజస్తాన్ రాయల్స్‌కు మారి అక్కడా తనను తాను నిరూపించుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్లో 17 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో ఈ యార్కర్ల కింగ్ పెద్దగా సత్తా చాటలేకపోయాడు. ఉత్తరాఖండ్ తరపున ఆరు మ్యాచ్‌లలో మూడు వికెట్లే తీశాడు. అయితే, అతడి అనుభవం దృష్ట్యా ఈసారి మంచి ధర దక్కించుకునే అవకాశం ఉంది.అశోక్ శర్మసయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో రాజస్తాన్ తరఫున సత్తా చాటుతున్నాడు అశోక్ శర్మ. ఇప్పటికి ఏడు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 19 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు నెట్‌బౌలర్‌గా పనిచేసిన అశోక్ శర్మ ఈసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. -
IPL 2026: మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..: కామెరాన్ గ్రీన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.110 మంది విదేశీ ప్లేయర్లు అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.అయితే, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్‌లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్‌లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్‌గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్‌లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్‌గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్‌కు తెలిసే ఉండదు.పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.గ్రీన్‌పై భారీ అంచనాలుఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.చదవండి: ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రెడీ: తిలక్ వర్మ


