ఐపీఎల్-2026 మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లైమ్ లివింగ్‌స్టోన్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. ఈ డేంజరస్ ప్లేయర్లను రూ. 13 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బెస్ ప్రైస్‌తో వేలం తొలి రౌండ్‌లోకి వచ్చిన అతడిని దక్కించుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.
కానీ యాక్సలరేటెడ్ రౌండ్‌లో మాత్రం లివింగ్‌స్టోన్ కోసం ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి. ముఖ్యంగా ఎస్ఆర్‌హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్ఎస్‌జీ ఫ్రాంచైజీ తమ పర్స్‌లో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది. కానీ ఎస్ఆర్‌హెచ్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు.
దీంతో లక్నో పోటీ నుంచి తప్పుకోంది. చివరికి అతడు హైదరాబాద్ సొంతమయ్యాడు. లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. కానీ వేలానికి ముందు అతడిని ఆర్సీబీ తమ జట్టు నుంచి రిలీజ్ చేసింది. దీంతో వేలంలోకి వచ్చిన అతడికి జాక్ పాట్ తగిలింది.
కానీ ఈ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. లియామ్ లివింగ్‌స్టోన్ మినహా మిగతా అందర్నీ అన్‌క్యాప్డ్ భారత ప్లేయర్లనే కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వీళ్లే.. లియామ్ లివింగ్‌స్టోన్, సలీల్ అరోరా, క్రైన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, షాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్.


