రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్ మాల్‌లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్‌లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్ దురంధర్‌ను వీక్షించింది.
ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.


