టాలీవుడ్ బుల్లితెర నటి అన్షు రెడ్డి తన కోరికను నెరవేర్చుకుంది. ఖరీదైన కారును కొనుగోలు చేసిన సీరియల్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న బుల్లితెర నటి ఆ తర్వాత పలు సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది.
అన్షు రెడ్డి దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో నర్మదగా టాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. అన్షు తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ కనిపించింది. సీరియల్స్‌తో పాటు డీ జోడీ-20లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అంతే కాకుండా అన్షు రెడ్డికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఎలాంటి వీడియోలు చేయడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది బుల్లితెర భామ.


