breaking news
Anshul
-
యస్... ఇది నా డబ్బు!
పెళ్లికి ముందు చిన్నా చితకా ఖర్చులకు తల్లిదండ్రుల మీదే ఆధారపడేది అన్షుల్ పరేఖ్. పెళ్లి తరువాత భర్త మీదే ఆధారపడేది. ‘ఇది నేను సొంతంగా సంపాదించిన డబ్బు’ అనుకునే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. అయితే 52 ఏళ్ల వయసులో కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. ఈ ఆనందాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది పరేఖ్. గృహిణులు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను పంచుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించింది సోషల్ మీడియా. వీడియో విషయానికి వస్తే... ఫోన్ చూస్తున్న అన్షుల్ పరేఖ్‌ను ‘ఏమైంది మమ్మీ?’ అని అడుగుతుంది ఆమె కూతురు.‘నా జీవితంలో తొలి సంపాదనను 52 ఏళ్ల వయసులో, ఆరు నెలల్లో యూట్యూబ్ ద్వారా Üంపాదించాను’ అని తన సంతోషాన్ని కూతురితో కలిసి పంచుకుంది అన్షుల్. ‘అమ్మను చూసి గర్వపడుతున్నాను’ అని తల్లి గురించి చెప్పింది ఆమె కూతురు. ‘కలలకు వయసు అడ్డంకి కాదు. కష్టపడితే చాలు అని మా అమ్మ నిరూపించింది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్యాప్షన్‌లో తల్లి గురించి ఎంతో మురిపెంగా రాసుకుంది కూతురు. -
కొత్త కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర నటి
టాలీవుడ్ బుల్లితెర నటి అన్షు రెడ్డి తన కోరికను నెరవేర్చుకుంది. ఖరీదైన కారును కొనుగోలు చేసిన సీరియల్ నటి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న బుల్లితెర నటి ఆ తర్వాత పలు సీరియల్స్‌తో అభిమానులను మెప్పించింది.అన్షు రెడ్డి దాదాపు పదేళ్లుగా 15కి పైగా సీరియల్స్‌లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మదగా టాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. అన్షు తెలుగుతో పాటు తమిళ సీరియల్స్‌లోనూ కనిపించింది. సీరియల్స్‌తో పాటు డీ జోడీ-20లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది. అంతే కాకుండా అన్షు రెడ్డికి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఎలాంటి వీడియోలు చేయడం లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది బుల్లితెర భామ. View this post on Instagram A post shared by Anshu Reddy❤ (@_anshureddy) -
ప్రణబ్ కుమార్తెకు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వాదనను బలంగా వినిపించేదుకు ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులుగా శర్మిష్ట ముఖర్జీ, అన్షుల్ మీరా కుమార్‌లను నియమించింది. వీరి నియామకానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోద ముద్ర వేశారు. వీరిలో షర్మిష్ట మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె కాగా, అన్షుల్ లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తనయుడు అన్న సంగతి విదితమే. కాగా, తొలుత ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న షర్మిష్ట.. ఆ తర్వాత ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాజాగా తనను కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే సోనియాకు కృతజ్ఞతలు తెలిపిన శర్మిష్ట.. అన్షుల్‌కు అభినందనలు తెలియజేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత పలువురు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధులు తమ పదవుల నుంచి వైదొలగారు. అలాగే లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత.. నెల రోజులపాటు తమ పార్టీ నుంచి టీవీ డిబెట్లకు ఎవరిని పంపడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో పలు కీలక నియామకాలు చేపడుతున్నారు. ఇటీవలే హర్యానా కాంగ్రెస్‌కు కొత్త సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జాను నియమించిన సంగతి తెలిసిందే. INC COMMUNIQUE Appointment of following persons as National Spokesperson, AICC. pic.twitter.com/fg0UGRFjp1 — INC Sandesh (@INCSandesh) September 9, 2019 -
షూట్ @ సైట్
ఓ అనాథాశ్రమానికి మీరు వెళ్లారు. అక్కడ కనీస వసతులు లేవు. అప్పుడు ఏం చేస్తారు?నిర్వాహకులకు కొన్ని ఉచిత సలహాలు పడేస్తారు. వీలైతే.. కొంత ఆర్థికసాయం చేస్తారు. అలాగే ఓ పదమూడేళ్ల బాలిక అయిన వారికి దూరమై అష్టకష్టాలు పడుతోందనే విషయం తెలిస్తే అయ్యో అని జాలిపడతారు. ఆ అమ్మాయి గాని మిమ్మల్ని కలిస్తే కాసిన్ని డబ్బులిచ్చి సాయపడతారు. ఈ టీమ్ మాత్రం అలా సరిపెట్టదు. సదరు సమస్యలపై కెమెరా ఎక్కుపెడుతుంది. వాటిని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక బలమైన చేయూతను పోగు చేసుకుని మరీ పరిష్కారాల్ని కనిపెడుతుంది. ఆ టీమ్ పేరు బ్లూ ఫంక్. వీరేం చేశారో, చేయనున్నారో తెలుసుకోవాలనుందా..? అయితే... గెట్ ఇన్ టు దిస్ స్టోరీ... - ఎస్.సత్యబాబు ఓసారి బ్లూ ఫంక్ టీమ్.. మలక్‌పేటలోని ప్రభుత్వ అంధ పాఠశాలలో వసతుల లేమిపై డాక్యుమెంటరీ తీసింది. దాన్ని నగరంలోని 15 కాలేజీల్లో ప్రదర్శించింది. దీంతో వాళ్లకి కొన్ని ప్రాథమిక అవసరాలు తీరడంతో పాటుగా 12 కంప్యూటర్లు కూడా లభించాయి. సంఘంలో పేరుకుపోయిన సమస్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్న బ్లూ ఫంక్ టీమ్ రూపకర్త అన్షుల్ సిన్హా. ఈ పాతికేళ్ల కుర్రాడి సార థ్యంలో నడుస్తున్న ఈ టీమ్ వినూత్న తరహాలో సొసైటీలోని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ చూపిస్తోంది. బేస్.. కాలేజ్ డేస్.. ‘మా సోషల్ రెస్పాన్సిబిలిటీకి బీజం పడింది కాలేజ్ డేస్‌లోనే’ అని చెప్తారు అన్షుల్. మూడేళ్ల క్రితం ఎంబీఏ చదువుతుండగా రోజుకు తలో రూపాయి కలెక్ట్ చేసి పలు ఆర్ఫనేజ్ హోమ్‌లు, ఎన్జీవో సంస్థలకు అందించేవాళ్లీ ఫ్రెండ్స్. ‘అయితే మేం చేసే కాసింత సాయం ఏ మూలకీ రాదని తెలిశాక.. ఈ డాక్యుమెంటరీ ఐడియా వచ్చింది’ అంటూ వివరించారు అన్షుల్. అప్పటి నుంచి తమ దృష్టికి వచ్చిన సమస్యల్లో నుంచి కొన్నింటిని ఎన్నుకుని డాక్యుమెంటరీలుగా మలుస్తున్నామన్నారు. సామాజిక కోణం.. ‘ఓ ఆర్ఫనేజ్కి వెళ్లినప్పుడు నాగోల్ అమ్మాయి వైష్ణవి (13)ని కరీంనగర్ తీసుకెళ్లి చైల్డ్లేబర్గా మార్చిన వైనాన్ని తెలుసుకుని, ఆ అమ్మాయి కష్టాల్ని యథాతథంగా చిత్రీకరించాం. డాక్యుమెంటరీగా మలచి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం’ అంటూ కేవలం ఆర్థిక సాయానికి మాత్రమే కాకుండా మరికొన్ని సామాజిక సమస్యలపై కూడా తాము స్పందించే తీరును వెల్లడించాడు అన్షుల్. అలా ఒక ఏడాదిలో ఈ బృందం 12 డాక్యుమెంటరీలు తీసింది. వీటిలో కొన్ని పలు అవార్డులను సైతం దక్కించుకున్నాయి. అవార్డుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సోషల్ కాజ్ కోసమే ఖర్చు పెడుతోందీ టీమ్. రిమూవ్ పావర్టీ ఫ్రం ఇండియా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అనే అంశంపై తీసిన చాకొలెట్ రూమ్, బయో మెడికల్ వేస్టేజ్ పై చిత్రం, హైదరాబాద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 3 నెలలు రీసెర్చ్ చేసి తీసిన మరో డాక్యుమెంటరీ.. ఇలా సామాజిక సమస్యల పై స్పందిస్తున్న అన్షుల్ బృందం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆ మార్గంలోనే.. ‘హ్యాండీ కామ్ లాంటి చిన్న సాధనంతోనే పెద్ద పెద్ద సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అర్థమయ్యాక ఆ మార్గాన్ని వీడలేకపోయాను’ అని అంటాడు అన్షుల్. ఇంటర్ కాలేజ్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 14 అవార్డ్స్, మై చాకొలెట్ కవర్ ద్వారా మరో డజనుకు పైగా పురస్కారాలు, కమ్యూనలిజంపై తీసిన ‘లాపెట్’ ద్వారా అంతర్జాతీయ స్థాయి అవార్డ్స్.. ఇలా డాక్యుమెంటరీల ద్వారా అత్యధిక పురస్కారాలు అందుకున్న యువ బృందంగా నిలిచింది బ్లూఫంక్. తెగిపడి తమ ముందు వాలిన పతంగి కోసం భిన్న మతాలకు చెందిన నలుగురు చిన్నారులు కొట్లాడు కోకుండా దాని చిరుగులు అతికించి, మరింత బాగా ఎగిరేలా చేయడం అనే కాన్సెప్ట్‌తో తీసిన లాపెట్.. పలు అంతర్జాతీయ పురస్కారాలను ఎగరేసుకుపోయింది. సమస్య ఏదైనా.. ‘యువతరం తలచుకుంటే అసాధ్యమనేది లేదు. ఒక కాలేజ్‌కు చెందిన కొందరు విద్యార్థులే ఇంత చేయగలిగితే.. సిటీలోని అన్ని కాలేజీల విద్యార్థులు చేయి కలిపితే.. ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంద’ని అంటాడు అన్షుల్. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, తర్వాత విద్యార్థి లోకంలో తలెత్తిన అయోమయాన్ని వివరిస్తూ వీరు తీసిన డాక్యుమెంటరీ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ది ఆన్‌సీన్ డిజాస్టర్, బ్లైండ్ ఇమేజ్, స్విచ్ ఆఫ్, ఫ్లిప్ బుక్, లాపెట్ రిటర్న్స్, రోడ్ ఆఫ్ సెపరో.. ఇలా దాదాపు 38 చిత్రాలు తీసిన ఈ బృందం 48 అవార్డులు సొంతం చేసుకుంది. ఆర్గాన్ మాఫియాపై గురి... ఇన్నాళ్లు సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించిన వీరి కెమెరా.. ఇప్పుడిప్పుడే సవాళ్లకు సై అంటోంది. స్టింగ్ ఆపరేషన్ ద్వారా పరిశోధనాత్మక చిత్రాలను రూపొందించే పనిలో ఉంది. నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వాస్పత్రులకు చెందిన సిబ్బంది నిర్వాకంతో యథేచ్ఛగా సాగుతున్న ఆర్గాన్ మాఫియాను చూపించడం తమ తొలి ప్రయత్నంగా అన్షుల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న అవయవ వ్యాపారం సిటీలో కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా సాగుతున్న వైనంపై ఏడాది పాటు పరిశోధించి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ‘ఆర్గాన్ మాఫియాపై తీసిన చిత్రం ‘గేట్ వే టు హెవెన్’ సెన్సార్ దశలో ఉంది, అది వెలుగులోకి వస్తే ఆర్గాన్ మాఫియా జాడలు సమాజానికి తెలుస్తాయి’ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు అన్షుల్. కెమెరా నేత్రంతో వ్యవస్థ బాగు కోసం పాటుపడుతున్న బ్లూ ఫంక్కు హ్యాట్సాఫ్ !


