సోషల్ మీడియా
పెళ్లికి ముందు చిన్నా చితకా ఖర్చులకు తల్లిదండ్రుల మీదే ఆధారపడేది అన్షుల్ పరేఖ్. పెళ్లి తరువాత భర్త మీదే ఆధారపడేది. ‘ఇది నేను సొంతంగా సంపాదించిన డబ్బు’ అనుకునే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. అయితే 52 ఏళ్ల వయసులో కంటెంట్ క్రియేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది.
ఈ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పంచుకుంది పరేఖ్. గృహిణులు వారి అభిరుచులు, రోజువారీ అనుభవాలను పంచుకుంటూ ఎంతో కొంత డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించింది సోషల్ మీడియా. వీడియో విషయానికి వస్తే... ఫోన్ చూస్తున్న అన్షుల్ పరేఖ్‌ను ‘ఏమైంది మమ్మీ?’ అని అడుగుతుంది ఆమె కూతురు.
‘నా జీవితంలో తొలి సంపాదనను 52 ఏళ్ల వయసులో, ఆరు నెలల్లో యూట్యూబ్ ద్వారా Üంపాదించాను’ అని తన సంతోషాన్ని కూతురితో కలిసి పంచుకుంది అన్షుల్. ‘అమ్మను చూసి గర్వపడుతున్నాను’ అని తల్లి గురించి చెప్పింది ఆమె కూతురు. ‘కలలకు వయసు అడ్డంకి కాదు. కష్టపడితే చాలు అని మా అమ్మ నిరూపించింది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో క్యాప్షన్‌లో తల్లి గురించి ఎంతో మురిపెంగా రాసుకుంది కూతురు.


