డ్యామేజ్‌ని కూడా ఫ్యాషన్‌గా మార్చేశారు..! | Luxury Brand Sells White Shirt With 'Iron Burn' Design For Rs 1 Lakh | Sakshi
Sakshi News home page

డ్యామేజ్‌ని కూడా ఫ్యాషన్‌గా మార్చేశారు..!

Feb 19 2026 1:57 PM | Updated on Feb 19 2026 3:33 PM

Luxury Brand Sells White Shirt With 'Iron Burn' Design For Rs 1 Lakh

ఫ్యాషన్‌లో కొన్ని వింత పోకడలు పిచ్చెక్కించేలా ఉంటాయి. నీ క్రియేటివిటీ పాడు కాను అని తిట్టుకునేలా ఉంటాయ్‌. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌లు ఇలాంటే పనులే చేసి అభాసుపాలయ్యాయి. కొత్తగా క్రియేట్‌ చేసే సామర్థ్యం తప్పిందో లేక జనాలను తక్కువ అంచనా వేస్తున్నారో తెలియదు గానీ..పొరపాటున డ్యామేజ్‌ అయ్యే వాటినే లేటెస్ట్‌ ట్రెండీ ఫ్యాషన్‌ అంటూ పరిచేయం చేయడం బాధకరం. పైగా వాటి ధర కూడా కనివినీ ఎరుగుని రేంజ్‌లో ప్రకటించి..ఆయా బ్రాండ్‌ విలువలను దిగజార్చుకుంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరిగింది. 

'వెట్మెంట్స్‌' అనే లగ్జరీ ఫ్యాసన్‌ బ్రాండ్‌ 'ఐరన్ బర్న్' గుర్తు ఉన్న సాదా తెల్లచొక్కాను మార్కెట్లోకి విడుదల చేసి..దీని ధర ఏకంగా రూ. 1లక్ష అని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఇదేం ఫ్యాషన్‌ అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రియేటివిటీ రాకపోతే కామ్‌గా ఉండు..మరి ఇలానా అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు. చూడాలంటే మనం ఐరన్‌ చేసేటప్పుడు పొరపాటు షర్ట్‌ జేబు కాలిన గుర్తులా ఉంది అది. 

ఏదో లేటెస్ట్‌ ఫ్యాషన్‌ షర్ట్‌ అంటూ మార్కెట్లోకి వదలడమే కాక..అంత ఖరీదు ప్రకటించి జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు నెట్టింట. అంతేగాదు ఫ్యాషన్‌ కళాత్మకంగా కనుమరుగై..జోక్‌గా మారిపోయింది అని సెటైర్లు వేస్తు పోస్టులుపెట్టారు కూడా. 

 

(చదవండి: ఏఐ సదస్సు లంచ్‌​ మెనూ ఇదే..! పాలు, గోధుమలు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement