అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్‌! | Shweana Poy Raiturcar Wedding Lehenga Cost Rs 1 Crore | Sakshi
Sakshi News home page

అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్‌!

Feb 19 2026 10:17 AM | Updated on Feb 19 2026 10:55 AM

Shweana Poy Raiturcar Wedding Lehenga Cost Rs 1 Crore

అంబానీల వంశంలోకి కొత్త సభ్యురాలుగా శ్వేనాపోయ్‌ చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలయన్స్‌ దిగ్గజం ముఖేశ్‌ అంబానీ మేనల్లుడు విక్రమ్ సల్గావ్కర్‌, శ్వేనపోయ్‌లు ఈ నెల(ఫిబ్రవరి) 12న ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మొత్తం అంబానీల కుటుంబం హాజరై సందడి చేశారు. ఈవేడుక అంబానీల రేంజ్‌కి తగ్గట్టుగా అత్యంత విలాసవంతంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో శ్వేనాపోయ్‌ ధరించిన లెహంగా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆ లెహంగా ఖరీదు ఊహకందని రేంజ్‌లో ఉంది. ఇంత ధరపలికే లెహంగాలు కూడా ఉంటాయా అని విస్తుపోయేలా ఉంది. ఆ ఫ్యాబ్రిక్‌ని డిజైన్‌ చేసిన విధానంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!.

ముఖేశ్‌ అంబానీ మేనల్లుడు, దివగంత ధీరూభాయ్‌ అంబానీ మనవడు విక్రమ్‌ సల్గావ్కర్‌ని పెళ్లాడి శ్వేనా అంబానీ కుంటుంబంలోకి అడుగుపెట్టింది. ఆమె తన పెళ్లివేడుకలో ధరించిన లెహంగా అత్యంత హైలెట్‌గా నిలిచింది. ఈ లెహంగా సాంప్రదాయ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసినది మాత్రం కాదు. చాలా స్పెషాల్టీ ఉంది ఈ లెహంగాకి. లోహదారాలతో తయారు చేశారట. దీన్ని జేఏడీఈ(JADE)కి చెందిన మోనికా షా డిజైన్‌ చేశారట. 

ఈ లెహంగాని డిజైన్‌ చేయడానికే దాదాపు 1500 గంటలపైనే పట్టిందట. చాణిక్య ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌కి చెందిన 40 ఏళ్ల నాటి వారసత్వానికి నిదర్శనం ఈ లెహంగా. అరుదైన మొఘల్-యుగ కసబ్ టెక్నిక్‌ను పునర్జీవింప చేసేలా ఈ లెహంగాను తీర్చిదిద్దారు. చెప్పాలంటే ఇదోక కవచంలా ఉంటుంది. ఈ మొఘల్-యుగ కసబ్ టెక్నిక్ ఎంబ్రాయిడరీ గుజరాజ్‌, రాజస్థాన్‌ వంటి ప్రాంతాలలో ఉద్భవించిందని అంటుంటారు. 

అక్కడ చేతివృత్తులు వారు వెల్వేట్‌, బ్రోకేడ్‌తో సహ పలు రకాల విలాసవంతమైన దుస్తులను బంగారం లేదా వెండి లోహ దారాలతో తయారు చేస్తారట. వీటిని పట్టు లేదా కాటన్ కోర్ చుట్టూ ఈ డిజైన్‌ని రూపొందిస్తారు. చాలా సందర్భాల్లో మెటాలిక్ పాలిస్టర్‌ని కూడాఉపయోగిస్తారు. అంతేగాదు ఈ ఎంబ్రాయిడరీ అభ్యసించే కళాకారులకు చాలా నైపుణ్యం, ఓపిక తప్పనిసరిగా ఉండాలట. కసబ్‌ ఎంబ్రాయిడరీలో అత్యంత కష్టమైనది.. ఫ్రాబ్రిక్‌ ఉపరితలంపై లోహదారాలను అత్యంత జాగ్రత్తతో, నైపుణ్యంతో కుట్టాల్సి ఉంటుందట. 

అంతేగాదు ఈ డిజైన్లు ప్రాంతీయ సౌందర్యం, సంప్రదాయలను ప్రభావితం చేసేలా కళాత్మకంగా రూపొందిస్తారు. దీనిలో కసబ్ జర్దోజీ, గోటా పట్టి వంటి విభిన్న శైలులు కూడా ఉంటాయట. అచ్చం ఇలాంటి లెహంగానే మినావాలా కేన్స్ 2025లో అర్పితా మెహతా ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ శ్వేనా కారణంగా ఈ ఎంబ్రాయిడరీ గొప్పదనం మరోసారి వెలుగులోకి వచ్చి హెలెట్‌గా నిలిచింది. దీని ధర సుమారు రూ. 1 కోటి రూపాయలు పైనే పలుకుతుందట.

 

(చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement