వెండి పెళ్లి పత్రిక! | Jaipur Man Creates Rs 25 Lakh Wedding Card | Sakshi
Sakshi News home page

వెండి పెళ్లి పత్రిక!

Feb 19 2026 6:10 AM | Updated on Feb 19 2026 6:10 AM

Jaipur Man Creates Rs 25 Lakh Wedding Card

అపూర్వ కానుక

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన శివ్‌ జోహ్రీ తన కుమార్తెకి అపురూపమైన, అందమైన కానుకని అందించాడు. కూతురి వివాహం కోసం రూ. 25 లక్షల విలువైన వెండి వివాహ పత్రికను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాక్సు తరహాలో ఈ పెళ్లికార్డును రూపొందించారు. కార్డు తయారీలో మేకులు, స్క్రూలను వాడలేదు. 

ఈ పత్రిక బరువు సుమారుగా 3 కిలోలు ఉంటుంది. పొడవు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు ఉంటుంది. ΄ûరాణిక ఘట్టాలను, దేవతామూర్తులను  పత్రికపై అద్భుతంగా తీర్చిదిద్దారు. రామదర్బార్, శివపార్వతుల కళ్యాణం, రాధాకృష్ణులు, తిరుపతి ఆలయ ద్వారాలు, శేష పాన్పుపై పవళించిన విష్ణుమూర్తి... మొదలైన చిత్రాలు దీనిపై కనిపిస్తాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement