breaking news
silver arnament
-
వెండి పెళ్లి పత్రిక!
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన శివ్ జోహ్రీ తన కుమార్తెకి అపురూపమైన, అందమైన కానుకని అందించాడు. కూతురి వివాహం కోసం రూ. 25 లక్షల విలువైన వెండి వివాహ పత్రికను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బాక్సు తరహాలో ఈ పెళ్లికార్డును రూపొందించారు. కార్డు తయారీలో మేకులు, స్క్రూలను వాడలేదు. ఈ పత్రిక బరువు సుమారుగా 3 కిలోలు ఉంటుంది. పొడవు 8 అంగుళాలు, వెడల్పు 6.5 అంగుళాలు ఉంటుంది. ΄ûరాణిక ఘట్టాలను, దేవతామూర్తులను పత్రికపై అద్భుతంగా తీర్చిదిద్దారు. రామదర్బార్, శివపార్వతుల కళ్యాణం, రాధాకృష్ణులు, తిరుపతి ఆలయ ద్వారాలు, శేష పాన్పుపై పవళించిన విష్ణుమూర్తి... మొదలైన చిత్రాలు దీనిపై కనిపిస్తాయి. -
వచ్చే ఏడాదిలోనూ పసిడిలో రాబడులు
న్యూఢిల్లీ: సంవత్ 2081లోనూ (వచ్చే ఏడాది కాలంలో) బంగారం, వెండి ఇన్వెస్టర్లకు రాబడులు కురిపించనున్నాయి!. దేశ ఆర్థిక వ్యవస్థలో సానుకూల వృద్ధికి తోడు, అనిశి్చతుల్లో సురక్షిత సాధనంగా ఉన్న గుర్తింపు బంగారంలో ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్ 2080లో నిఫ్టీ 25 శాతం పెరగ్గా, బంగారం 30 శాతం రాబడులను ఇచ్చింది. ‘‘సంవత్ 2081 బంగారానికి అనుకూలంగా ఉంటుంది. కనీసం 10 శాతం రాబడులు ఇవ్వొచ్చు. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రభావంతో కొనుగోళ్లు ఇదే మాదిరి కొనసాగితే గరిష్టంగా 15–18% రాబడులకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ దిగుమతులపై సుంకాలు పెంచితే బంగారం పనితీరు 15 శాతాన్ని మించొచ్చు. స్థిరమైన వడ్డీ రేట్ల వాతావరణం సైతం బంగారం ఎగువవైపు ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది’’అని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. సంవత్ 2080లో వెండి ధర 40% ర్యాలీ చేసిందని, రాబడుల్లో స్థిరమైన ధోరణి కొనసాగుతుందని అన్నారు. -
వెండి కిరీటం సమర్పణ
తణుకు అర్బన్ : స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన వేంకటేశ్వరస్వామికి ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన ద్వారంపూడి నాగిరెడ్డి, లావణ్య దంపతులు, కొవ్వూరి పెద వెంకటరెడ్డి, నాగమణి దంపతులు బుధవారం వెండి కిరీటాన్ని సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వెంకటరెడ్డి, పీపీ రంగరాజన్ పాల్గొన్నారు.


