ఎవరీ సోఫీ రెయిన్‌? కంటెంట్‌ క్రియేటర్‌గా అన్ని కోట్లా..! | OnlyFans Creator Sophie Rain Claims She Earned 101 Million Dollars | Sakshi
Sakshi News home page

ఎవరీ సోఫీ రెయిన్‌? కంటెంట్‌ క్రియేటర్‌గా అన్ని కోట్లా..!

Jan 29 2026 1:31 PM | Updated on Jan 29 2026 2:39 PM

OnlyFans Creator Sophie Rain Claims She Earned 101 Million Dollars

కంటెంట్‌ క్రియేటర్‌గా చాలామంది రాణిస్తున్నారు. కొందరు వేలల్లో ఆర్జిస్తే..ఇంకొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ కోట్లలలో సంపాదించడం గురించి విన్నారా..?. ఔను ఇది నిజం. జస్ట్‌ కంటెంట్‌ క్రియేటర్‌గా ఆ రేంజ్‌లో సంపాదనా..!? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఆ అమ్మాయి తాను చెబుతోందంతా నిజం అంటూ ఏవిధంగా ఆమె ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో కోట్లలో ఆర్జిస్తోంది ఆధారాలతో  సహా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వివరించింది. 

ప్రముఖ అమెరికన్‌ ఓన్లీఫ్యాన్స్‌ క్రియేటర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ సోఫీ రెయిన్‌  వివిధ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా సుమారు రూ. 930 కోట్లకు పైనే సంపాదిస్తున్నానని వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలతో సహా స్కీన్‌షాట్లతో చూపించింది. మొత్తంగా ఆల్‌టైమ్‌ ఆదాయం ఎంత ఉంటుందో స్క్రీన్‌ షీట్‌ తీసి మరి చూపించింది. తాను అబద్ధం చెప్పడం లేదని, ఈ విజయం అసాధారమైనది మాత్రం కాదని చెప్పుకొచ్చింది. సగటు కంటెంట్‌ క్రియేటర్‌ నెలకు దగ్గర దగ్గర రూ. 13 వేలుదాక సంపాదించగలడని..తాను మాత్రం వాళ్లందరికంటే అధిక మొత్తంలో ఆర్జిస్తున్నానని ధీమాగా చెబుతోంది. 

అందుకు అపారమైన లక్‌తోపాటు..లక్షలాది ఫాలోవర్స్‌ కూడా చాలా అవసరమని పేర్కొంది. 2024 ఏడాదికే తాను రూ. 359 కోట్లు దాక ఆర్జించినట్లు వెల్లడించింది. జస్ట్‌ ఆన్‌లైన్‌ వీడియోలతో స్టార్ జేసన్ టాటమ్ వంటి ప్రొఫెషనల్‌ అథ్లెట్ల వార్షిక జీతాలను అధిగమించింది. ఆమె తన ఆదాయంలో కొంత ప్రైవేట్‌ జెట్లు, కార్ల కోసం ఖర్చు చేసినా..కొంత భాగాన్ని మాత్రం తండ్రి అప్పులు తీర్చడానికి ఉపయోగించడం విశేషం. అయితే రెయిన్‌ 70% సంపాదనను పెట్టుబడుల్లో పెట్టినట్లు పేర్కొంది.  

ఎవరీమె..?
సోఫీ రెయిన్ 21 ఏళ్ల అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ , కంటెంట్‌ క్రియేటర్‌, ఓన్లీఫ్యాన్స్‌ వంటి సోషల​ మీడియా అకౌంట్లతో బాగా గుర్తింపు దక్కించుకుంది. అక్కడ ఆమె తన తన సబ్‌స్క్రైబర్‌లతో ప్రత్యేకమైన కంటెంట్‌ను పంచుకుంటుంది. 2004లో ఫ్లోరిడాలోని మయామిలో జన్మించిన సోఫీ, ఓన్లీఫ్యాన్స్‌లో 11 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల మంది ఫాలోవర్లతో సహా బహుళ ప్లాట్‌ఫామ్‌లలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

సోఫీ తన కెరీర్‌ని వెయిటర్‌గా ప్రారంభించింది, కానీ ఆమె బాస్, ఓన్లీఫ్యాన్స్ వంటి సోషల్‌మీడియా ఖాతాల సాయంతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కంటెంట్‌ క్రియేటివిటీ, మాటల ఆకర్షణ సాయంతో ఎక్కువమంది సబ్‌స్కైబర్లను ఆకర్షించింది. ఆమె కంటెంట్‌ పరంగానే కాకుండా సన్నిహిత ఫోటోషూట్‌ల విషయంలోనూ అత్యంత కేర్‌ఫుల్‌గా ఉంటుందామె. ప్రస్తుతం ఆమె బాప్‌హౌస్‌ కలెక్టివ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ వ్యవ‍స్థాకురాలు కూడా. 

(చదవండి: 'రాజా బేటా సిండ్రోమ్‌': 50 ఏళ్ల పైబడ్డ కూడా..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement