ఈ వీకెండ్ ఓటీటీల్లోకి బోలెడన్ని సినిమాలొచ్చాయి. వాటిలో మా ఇంటి బంగారం, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు, ఏక్ దిన్, గేదెల రాజు, చాంద్ మేరా దిల్, ది డెవిల్ తదితర తెలుగు, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే ఇప్పుడో తెలుగు సిరీస్ గురించి అధికారిక ప్రకటన చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ కామెడీ సినిమా 'పరిమళ అండ్ కో' తెలుగు రివ్యూ)
తెలుగు సీనియర్ నటుడు శ్రీకాంత్, అనన్య శర్మ ప్రధాన పాత్రలు చేస్తున్న కోర్ట్ రూమ్ డ్రామా/థ్రిల్లర్ 'అబ్జెక్షన్ మై లార్డ్'. జీ5 ఓటీటీలో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ చేయబోయే టీజర్ లేదా ట్రైలర్‌తో స్టోరీ ఏంటనేది తెలిసే అవకాశముంది.
ఇక రీసెంట్ టైంలో తెలుగు దర్శకులు కూడా ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర చేసిన 'సూపర్ సుబ్బు'.. రీసెంట్ టైంలో అలా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే మరిన్ని తెలుగు సిరీస్‌లు రెడీ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)


