ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా | Gedela Raju Movie OTT Streaming | Sakshi
Sakshi News home page

OTT: తెలుగు మూవీ.. రెండు ఓటీటీల్లో సడన్ స్ట్రీమింగ్

Jul 17 2026 1:26 PM | Updated on Jul 17 2026 1:45 PM

Gedela Raju Movie OTT Streaming

ఓటీటీల్లోకి ఈ వారం చాలానే సినిమాలు వచ్చాయి. సమంత 'మా ఇంటి బంగారం', సాయిపల్లవి 'ఏక్ దిన్', వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', దర్శన్ 'ద డెవిల్'తో పాటు చాలా డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటితో పాటు తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఒకేసారి రెండింటిలో అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ)

సింగర్ రఘు కుంచె, వికాస్ ముప్పల ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో రిలీజైంది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదో మూవీ ఉందని కూడా జనాలకు తెలీదు. ఇప్పుడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.

'గేదెల రాజు' విషయానికొస్తే.. కాకినాడ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ 'గేదెల రాజు', తన పలుకుబడితో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడు. కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఇతడిని ఎవరో హత్య చేస్తారు. ఈ సంఘటన తర్వాత రాజుతో శత్రుత్వం ఉన్నవాళ్లు, స్నేహితులు, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యక్తులు అనుమానితులుగా మారతారు. ఇంతకీ గేదెల రాజుని చంపింది ఎవరు? దాని వెనుకున్న కారణాలేంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సాయిపల్లవి సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement