చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల హడావుడి ఉండనే ఉంటుంది. ఈ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఐశ్వర్య రాజేశ్ 'ఓ సుకుమారి', మాధవన్ 'జీడీఎన్', వదలా, రాజా ది రాజా, ఆపరేషన్ అరుణారెడ్డి, మహేంద్రగిరి వారాహి లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేకాకుండా హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ' థియేటర్లలో సందడి చేయనుంది.
ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ వారంలో సమంత మా ఇంటి బంగారం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వడ్డే నవీన్ మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి రానుంది. వీటితో పాటు కన్నడ మూవీ ది డెవిల్ ఆసక్తిని పెంచుతోంది. దీంతో పాటు ఈ శుక్రవారం పలు హిందీ, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. మరి ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
ద మ్యాప్ ఆఫ్ లాంగింగ్ (స్పానిష్ సిరీస్) - జూలై 17
ద ఈస్ట్ ప్యాలెస్ (కొరియన్ సిరీస్) - జూలై 17
డిజైర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
23000 లైవ్స్ (జర్మన్ మూవీ) - జూలై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 17
25 ఇయర్క్ ఆఫ్ యూ(జపనీస్ సినిమా)- జూలై 17
స్పూకీ ఇన్ లవ్ (కొరియన్ సిరీస్) - జూలై 18
అమెజాన్ ప్రైమ్..
ది బే (హాలీవుడ్ మూవీ)- జూలై 17
జియో హాట్‌స్టార్..
మా ఇంటి బంగారం (తెలుగు మూవీ) - జూలై 17
టెస్ట్ సబ్జెక్ట్ వీ (హిందీ డాక్యుమెంటరీ) - జూలై 18
జీ5
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు (తెలుగు సినిమా) - జూలై 17
ది డెవిల్(కన్నడ సినిమా)- జూలై 17
లయన్స్ గేట్ ప్లే..
డెజర్ట్ వారియర్(హాలీవుడ్ మూవీ)- జూలై 17
టెక్సాస్ చైన్ సా(హాలీవుడ్ మూవీ)- జూలై 17


