టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆమెన్. ఈ సినిమాకు ఎస్కే బషీద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రేగుల నీరజరాణి నిర్మిస్తున్నారు.
దర్శకుడు ఎస్కే బషీద్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌కు భిన్నంగా ఆమెన్ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం... గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన మూవీ. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే నన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి.


