ప్రభాస్ ప్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పౌజీ’ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 3న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసింది. అందులో ప్రభాస్.. యుద్ధంలో ఒంటి నిండా రక్తంతో, తుపాకీపై చేయి పెట్టి కూర్చొని ఉన్నాడు. మునుపెన్నడూ ఇలాంటి పాత్రలో ప్రభాస్‌ని చూడలేదు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటించగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర బృందం త్వరలోనే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానుంది. ప్రచారంలో భాగంగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
अज्ञातपर्व ENDS.
THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3
Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026


