‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్‌ ఎమోషనల్‌! | Akhil Akkineni Meets His Fan Ayyagare No 1 Fame Naga Raju | Sakshi
Sakshi News home page

‘అయ్యగారి’కాళ్లపై పడి బోరున ఏడ్చేసిన అభిమాని.. అఖిల్‌ ఎమోషనల్‌!‘

Jul 16 2026 9:42 AM | Updated on Jul 16 2026 9:47 AM

Akhil Akkineni Meets His Fan Ayyagare No 1 Fame Naga Raju

‘అయ్యగారే నెంబర్‌ వన్‌’ అంటూ తనపై ప్రేమను చాటిన వీరాభిమాని నాగరాజును అఖిల్‌ అక్కినేని ఎట్టకేలకు కలిశాడు. నిన్న(జులై 15) గుంటూరులో జరిగిన  ‘లెనిన్’ సక్సెస్ మీట్‌ అనంతరం అఖిల్‌ తన అభిమాని నాగరాజుని కారవాన్‌లోకి పిలిపించుకొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాగరాజు ఎమోషనల్‌ అయ్యాడు. 

అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత అఖిల్‌ నుంచి ఏ సినిమా వచ్చినా సరే.. అందరి దృష్టి ఈ అభిమాని మీదకు వెళ్తుంది. లెనిన్‌ మూవీ రిలీజ్‌ ముందు కూడా నాగరాజు వీడియో మళ్లీ వైరల్‌ అయింది. కొంతమంది యూట్యూబర్లు అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. నాగరాజు కల్మషం లేని అభిమానం చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఒక్కసారైనా హీరోని కలిస్తే బాగుండేదని కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లే..నిన్న  నాగరాజుకు అఖిల్‌ను కలిసే అవకాశం దొరికింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement