అయ్యగారే నంబర్‌వన్.. సక్సెస్‌ మీట్‌లో అఖిల్ సతీమణి..! | Akhil Akkineni Wife Zainab Ravdjee Comments About Lenin Movie In Success, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Lenin Movie: అయ్యగారే నంబర్‌వన్.. సక్సెస్‌ మీట్‌లో అఖిల్ సతీమణి..!

Jul 15 2026 10:13 PM | Updated on Jul 16 2026 12:55 PM

Akhil Akkineni Wife Zainab Ravdjee Comments about Lenin Movie Success

అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్‌లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్‌ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్‌పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా మెప్పించింది.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement